Dasara Movie Update : నాని సినిమాకు ఆర్ఆర్ఆర్ కొరియో గ్రాఫర్.. గోదావరిఖనిలో ‘దసరా’ సాంగ్ షూటింగ్..

Published : Apr 11, 2022, 06:20 PM IST
Dasara Movie Update : నాని సినిమాకు ఆర్ఆర్ఆర్ కొరియో గ్రాఫర్.. గోదావరిఖనిలో ‘దసరా’ సాంగ్ షూటింగ్..

సారాంశం

నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ గోదావరిఖనిలో సాంగ్ షూట్ చేస్తోంది. ఇందుకు ‘ఆర్ఆర్ఆర్’ కొరియోగ్రాఫర్ ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరో నాని విభిన్న కథలను ఎంచుకుంటూ తన ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు.  తన సినిమాలు, పాత్రలు ఒకదానికొకటి భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాడు. గత కొన్ని చిత్రాలు కథ-కథనంలో చాలా ప్రత్యేకమైనవిగా ఉన్నాయి. ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ Shyam Singha Roy’ చిత్రంతో ఆడియెన్స్ ను అలరించాడు. నాని, సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించారు. ఆ తర్వాత నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. ఈ చిత్రం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. నాని సరసన హీరోయిన్ కీర్తి సురేష్ ఆడిపాడనుంది. 

అయితే ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మైనింగ్ ఏరియాల్లో కొనసాగుతోంది. అక్కడ నాని, కీర్తి సురేష్‌లపై తాజాగా ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. అయితే ఈ సాంగ్ కొరియోగ్రఫీ కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’RRRలో నాటు నాటు పాటతో యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ను రంగంలోకి దించారు. ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్న నాని, కీర్తిల మధ్య లవ్ సాంగ్ గా తెలుస్తోంది. ఈ సాంగ్ షూట్‌లో 500 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారంట. అధిక ఉష్ణోగ్రతలు, తేమ ఉన్నప్పటికీ.. చిత్ర  బృందం బాగానే శ్రమిస్తోంది.  

'దసరా' నాని మొదటి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ గా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల్లోని ఓ గ్రామం నేపథ్యంలో సాగే కథగా అర్థమవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానున్నట్టు సమాచారం.  

ఇటీవల విడుదలైన 'స్పార్క్ ఆఫ్ దసరా' గ్లింప్స్‌కి  ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. నాని మాస్ గెటప్, భయంకరమైన రూపంలో వీక్షకులను ఆశ్చర్యపరిచింది. నాని తొలిసారి యాక్షన్-ప్యాక్డ్ పాత్రను పోషిస్తుండటంతో  సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రఫీ అందించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌