మద్రాస్ హైకోర్డ్ లో నటి పూజా భట్ కు ఎదరు దెబ్బ..

Published : Jul 15, 2023, 11:13 AM IST
మద్రాస్ హైకోర్డ్ లో నటి పూజా భట్ కు ఎదరు దెబ్బ..

సారాంశం

ఒక భూమి వివాదంలో బాలీవుడ్ నటి పూజా భట్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఓ కేసు విషయంలో పూజా భట్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. 

బాలీవుడ్ నటి పూజాభట్ కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  ఓ భూమికి సబంధించిన వివాదంలో కోర్ట్ నుంచి పూజాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. నీలగిరి జిల్లా జెగదల గ్రామంలో  పూజా భట్ ఓ భూమిని కొనుగోలు చేశారు. అయితే అది  అసైన్డ్ భూమి అని తరువాత తెలిసింది. అయితే ఆమె కొన్న అసైన్డ్ భూమిపై వివాదం నెలకొంది.  అయితే ఆ భూమి  ఎస్టీ తెగకు చెందిన ఎం.కుప్పన్ అనే వ్యక్తికి 1978లో అప్పటి జిల్లా కలెక్టర్  కేటాయించారు. ఈ భూమి ఒక ఎకరం వరకూ ఉంటుంది. కాలక్రమంలో ఆ భూమి పలువురి చేతులు మారింది. ఇదే భూమిని పూజాభట్ కొన్నారు. 

అయితే ఈ భూమి కొనుగోలు చేయడం చెల్లదని... ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని గతంలో కొత్తగిరి తహశీల్దారు ఆదేశించారు. దీంతో పూజాభట్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పలు దఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు జడ్జి... తహశీల్దారు ఆదేశాలను అంగీకరిస్తూ తీర్పును వెలువరించారు. దాంతో ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగించల్సిన పరిస్థితి వచ్చింది. 

ఈ విషయంలో పూజా భట్ ఇంకా స్పందించలేదు. మరి ఈ విషయంలో ఆమె సుప్రీం కోర్డ్ కు వెళ్తుందా.. లేక  భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తుందా..? లేక ఈ విషయంలో ప్రభుత్వం నుంచి  ఏదైనా సహాయం కోరుతుందా అనేది చూడాలి. పూజా భట్ బాలీవుడ్ స్టార్ సీనియర్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురు. ఆయన వారసత్వంతో.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. నటిగా, నిర్మాతగా..మల్టీ టాలెంట్ చూపించింది. ప్రస్తుతం పూజా చెల్లెలు ఆలియా.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?