హాట్ న్యూస్ : రష్మిక, పూజ హెగ్డే ఇద్దరూ ఒకే సినిమాలో..

By Surya Prakash  |  First Published Dec 1, 2020, 6:52 PM IST

మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌ మరో తెలుగు చిత్రంలో నటించేందుకు ఆ మధ్య ఓకే చెప్పారు. కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహానటి నిర్మాతలు స్వప్పా దత్‌, ప్రియాంక దత్‌ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇప్పటికే  స్క్రిప్ట్‌ రెడీ అవ్వగా.. వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. 


తెలుగులో స్టార్ హీరోయిన్స్ గావెలుగుతున్న  పూజ హెగ్డే,   రష్మిక ఇద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది. మల్టీ స్టార్ హీరోయిన్స్ సినిమా అనాలేమో. అలాంటి ప్రాజెక్టు ఒకటి తెలుగులో రూపొందబోతోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరూ డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని సైన్ చేస్తున్నారని వినికిడి. మరి వీళ్లిద్దరితో కలిపి చేసే హీరో ఎవరూ అంటే దుల్కర్ సల్మాన్. 

వివరాల్లోకి వెళితే...మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌ మరో తెలుగు చిత్రంలో నటించేందుకు ఆ మధ్య ఓకే చెప్పారు. కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహానటి నిర్మాతలు స్వప్పా దత్‌, ప్రియాంక దత్‌ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇప్పటికే  స్క్రిప్ట్‌ రెడీ అవ్వగా.. వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. 

Latest Videos

ఇప్పటికే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో మార్చి నుంచి షూటింగ్‌లకు బ్రేక్ పడింది.  కేసులు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సెట్స్ మీదకు వెళ్లేందుకు ఎవరూ సాహసించ లేదు. దీంతో ఈ చిత్రాన్ని దుల్కర్ వాయిదా వేశారు. అయితే ఇప్పుడు పరిస్దితులు చక్కబడటంతో త్వరలోనే ఈ ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించేందుకు సంసిద్దులు అవుతున్నారు.  

ఇక ఇప్పటికే  దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా 'లెఫ్టినెంట్' రామ్ 'యుద్ధంతో' రాసిన ప్రేమకథ.. అంటూ అనౌన్సమెంట్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా హను రాఘవపూడి శైలిలో వార్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దుల్కర్ ను దృష్టిలో పెట్టుకుని తెలుగుతో పాటు మలయాళం మరియు తమిళ్ లో కూడా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

click me!