#PS1: ఆశ్చర్యం ... తెలుగులో టాక్ కు, కలెక్షన్స్ అసలు సంభంధం లేదు

By Surya PrakashFirst Published Oct 1, 2022, 8:37 AM IST
Highlights

 నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మణిరత్నం చేసిన సినిమా... అందులోను ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో పొన్నియన్ సెల్వన్‌ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. 

లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’ నిన్న శుక్రవారం రిలీజైంది. తమిళ రచయిత  కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేసే ప్లాన్ చేసారు.  నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మణిరత్నం చేసిన సినిమా... అందులోను ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో పొన్నియన్ సెల్వన్‌ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులుకు తెగ నచ్చేసింది. కానీ తెలుగు వారి దగ్గరకు వచ్చే సరికి సమస్య వచ్చేసింది. సినిమాకు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ వచ్చేసింది. ఈ నేపధ్యంలో కలెక్షన్స్ మాత్రం మొదటి రోజు బాగుండటం విశేషం.

తొలి రోజు ఓపినింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా బాగున్నాయి. రివ్యూలు బాగోపోయినా, మౌత్ టాక్ తేడాగా ఉన్నా మణిరత్నం మీద ఉన్న అభిమానంతో జనం థియేటర్స్ దగ్గర కనపడ్డారు. ముఖ్యంగా మల్టిఫ్లెక్స్ లు, A సెంటర్లలో ఈ సినిమా సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. నిన్న రాత్రి ఒక్కసారిగా కలెక్షన్స్ ఊపందుకున్నాయి. వీకెండ్ హంగామా థియేటర్స్ దగ్గర కనపడింది. రెండో రోజు అంటే శనివారం అడ్వాన్స్ బుక్కింగ్స్ బాగున్నాయి. తెలుగులో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మాగ్జిమం రికవరీ ఉండే అవకాసం ఉంది. సోమవారం నుంచి కలెక్షన్స్ బాగుంటే లాభాలు కనపడతాయి.
 
  ఇక  పొన్నియన్ సెల్వన్ మొత్తం రాజ్యాలు.. యుద్దం.. కుట్రలు తో నిండిఉండటంతో ఈ  చిత్రాన్ని చాలా మంది బాహుబలి తో పోలుస్తున్నారు.  దాంతో  ఈ సినిమాకు ఆ స్దాయి లేదని పెదవి విరుస్తున్నారు. స్లోనెరేషన్‌ సినిమాకు పెద్ద మైనస్‌. కథ జరిగే ప్రాంతాలు మారుతాయి కానీ.. కథనం మాత్ర కదినట్లే అనిపించదు. చాలా పాత్రలు.. పెద్ద పెద్ద నటులు కనిపిస్తారు కానీ.. ఏ ఒక్క పాత్ర కూడా గుర్తుండిపోయేలా తీర్చిదిద్దలేదు. 

యాక్షన్‌ సీన్స్‌ కూడా అంతగా ఆకట్టుకోవు. ఏ పాత్ర కూడా ఎమోషనల్‌గా కనెక్ట్‌ కావు. నవల ఆధారంగా ఈ స్క్రిప్ట్‌ను రాసుకోవడం వల్ల..ట్విస్టులు, వావ్‌ ఎలిమెంట్స్‌ ఏవి ఉండవు.  విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. క్లైమాక్స్‌లో మాత్రం ఓ చిన్న ట్విస్ట్‌ ఇచ్చి పార్ట్‌-2పై ఇంట్రస్ట్ పెంచే ప్రయత్నం చేసారు. మొత్తంగా ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు ,అది కూడా చరిత్రపై అవగాహన ఉన్నవారికి ఎంతో కొంతో నచ్చుతుంది. కానీ తెలుగు ప్రేక్షకులను మెప్పించడం కాస్త కష్టమే అని తేల్చారు. కానీ కలెక్షన్స్ ప్రస్తుతానికి బాగుండటం మణిరత్నం అభిమానులకు ఆనందం కలిగించే విషయం.
 

click me!