నువ్వు చేసిన పనికి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ రాజ్ తో ఫైమా రచ్చ.. హౌస్ కి కొత్త కెప్టెన్ గా కీర్తి

By team teluguFirst Published Sep 30, 2022, 10:57 PM IST
Highlights

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా మారుతోంది. నేడు ఎపిసోడ్ 27లో కొన్ని ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి.

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా మారుతోంది. నేడు ఎపిసోడ్ 27లో కొన్ని ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ హైలైట్ ఇప్పుడు చూద్దాం. ఆదిరెడ్డి, రేవంతా మధ్య మాటల యుద్ధంతో నేటి ఎపిసోడ్ ప్రారంభం అయింది. క్లీనింగ్ విషయంలో ఆదిరెడ్డి, రేవంత్ మధ్య చిన్న గొడవ జరుగుతుంది. 

ఇక ఫైమా ఎప్పటిలాగే తన ఫన్నీ కామెంట్స్ తో ఎంటర్టైన్ చేసింది. కొందరు హౌస్ మేట్స్ కూర్చుని సరదాగా మాట్లాడుకుంటుండగా.. ఫైమా రాజ్ పై చేసిన కామెంట్స్ నవ్వులు పూయించాయి. నువ్వు చేసిన పనికి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ? నువ్వు చేసిన పని అంతా చూసేసి నాకు పెళ్లి కాకుంటే ఎవరిడి భాద్యత అంటూ ఫైమా రాజ్ పై గోల పెడుతుంది. పక్కనే ఉన్న వారుకూడా ఫైమా కి సపోర్ట్ చేస్తారు. ఇదంతా చాలా సరదాగా జరుగుతుంది. రాజ్ నా నడుము గిల్లాడు అంటూ ఫైమా చిలిపిగా ఆరోపిస్తుంది. 

ఇంతలో బిగ్ బాస్ 'పంచ్ పడితే' టాస్క్ ని తిరిగి ప్రారంభించారు. ఈ టాస్క్ పూర్తయ్యే సరికి కెప్టెన్సీ పోటీలో కీర్తి, సుదీప, శ్రీ సత్య నిలుస్తారు. లెవల్ 2లో వీరి ముగ్గురి మధ్య కెప్టెన్సీ పోరు జరుగుతుంది. 

ఇందులో భాగంగా కెప్టెన్ అనే ఆంగ్ల అక్షరాలని ఒక్కొక్కటి తీసుకువచ్చి హుక్స్ కి తగిలించాలి. అక్షరాలని తీసుకుని వెళ్లేసమయంలో బిగ్ బాస్ ఇచ్చిన ప్యాడ్స్ పైనే నడవాలి. ఒక్కొక్కరికి రెండేసి ప్యాడ్స్ ఇచ్చారు. ఆ ప్యాడ్స్ ని ముందుకు జరుపుకుంటూ గమ్యం చేరుకొని అక్షరాలని అమర్చి కెప్టెన్ అనే పదం తయారు చేయాలి. 

అందరికంటే వేగంగా టాస్క్ ని పూర్తి చేసిన కీర్తి విజయం సాధిస్తుంది. బిగ్ బాస్ 6 కొత్త కెప్టెన్ గా అవతరిస్తుంది. దీనితో బిగ్ బాస్ కీర్తిని అభినందించి ఆమెకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారు. 

అనంతరం ఈ వారం వరెస్ట్ పెర్ఫామర్ ఎవరో తేల్చే సమయం వస్తుంది. ఒక్కొక్కరు తమకి నచ్చని కంటెస్టెంట్ ని నామినేట్ చేస్తారు. అలా వరస్ట్ పెర్ఫార్మర్ గా అర్జున్ కళ్యాణ్ కి ఎక్కువ ఓట్లు పడతాయి. అతడు శ్రీ సత్య కోసమే ఆడుతున్నాడు అంటూ కొందరు ఆరోపిస్తారు. దీనితో బిగ్ బాస్ అతడిని జైల్లో పెట్టాలని.. తదుపరి ఆదేశాల వరకు జైల్లోనే ఉండాలని కెప్టెన్ కీర్తిని ఆదేశించారు. 

click me!