సురేందర్ రెడ్డి ని ఆ యాంగిల్ లో కథ మార్చమన్న పవన్?

Published : Sep 14, 2023, 12:05 PM IST
సురేందర్ రెడ్డి ని ఆ యాంగిల్ లో కథ మార్చమన్న పవన్?

సారాంశం

సమకాలనీ అంశాలకు విభిన్నమైన యాక్షన్‌ కథను జోడించి ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే హింట్  ఇచ్చారు. 

రీసెంట్ గా 'బ్రో' సినిమాతో పలకరించిన  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో  సురేందర్ రెడ్డి ప్రాజెక్టు ఓకే చేయించుకుని, పూజ కూడా జరిపిన సంగతి తెలిసిందే. వాస్తవానికి మూడేళ్ల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. కానీ ఏళ్లు గడిచినా ఈ సినిమా పట్టలెక్కలేదు.. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టి పరుగెట్టిస్తున్నారు. స్క్రిప్టు వర్క్ స్టార్ట్ అయ్యినట్లు తెలుస్తోంది.

పవన్ సన్నిహితుడైన రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనుందని ప్రకటించారు. డైరక్టర్ సూరితో కలిసి ఎన్నో హిట్ చిత్రాలకు వర్క్ చేసిన దర్శక రచయిత వక్కంతం వంశీ కథ అందించనున్నారు.   భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించారు.  అయితే ఈ సినిమా కథ మొత్తం విన్న పవన్ కళ్యాణ్ ... తనకు పొలిటికల్ గా మైలైజ్ వచ్చేలా కొన్ని సీన్స్ మార్చమన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దాంతో మొత్తం స్క్రిప్ట్ ని తిరగరాస్తున్నట్లు వినికిడి. మొదట అనుకున్న యాక్షన్ కథను మార్చి పూర్తిగా  ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా  చేయబోతున్నారని అంటున్నారు. 

పవన్ కు ఎలక్షన్స్  క్యాంపైన్ కు ఉపయోగపడేలా అనిపిస్తే  వెంటనే సినిమాకు డేట్స్ ఇచ్చి మొదలెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది. దాంతో వక్కంతం టీమ్ తో , సురేంద్రరెడ్డి ఈ ప్రాజెక్టుపై రాత్రింబవళ్లూ కూర్చుంటున్నారని తెలుస్తోంది. దానికి తోడు సురేంద్రరెడ్డి తను రీసెంట్ గా చేసిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ కావటంతో ఎలాగైనా మళ్లీ ఫామ్ లోకి రావాలని అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారని చెప్తన్నారు. పవన్ కు    పెర్ఫెక్ట్ ఎలివేషన్ ఇచ్చే విధంగా ఎన్నికల లోపు ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో  వాస్తవం ఎంత అనేది మాత్రం క్లారిటీ లేదు.   సురేందర్ రెడ్డి మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ అయితే మాత్రం ఈ ప్రచారం వాస్తవమని అనుకోవచ్చు.

 ‘కిక్’, ‘రేసుగుర్రం’, ‘సైరా’ వంటి చిత్రాలతో దర్శకుడిగా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో రూపొందుతూండటంతో  పవన్ కళ్యాణ్ కు మరో బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు.మరో ప్రక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని హరీష్ శంకర్ ఆలోచిస్తున్నారు. ఇక OG మూవీ అయితే మార్చి ఆఖరున ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు తెలుస్తోంది.   

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌