మోహన్‌ బాబు ఇంటి దగ్గర కలకలం సృష్టించిన నలుగురి అరెస్ట్‌

Published : Aug 02, 2020, 10:48 AM ISTUpdated : Aug 02, 2020, 10:50 AM IST
మోహన్‌ బాబు ఇంటి దగ్గర కలకలం సృష్టించిన నలుగురి అరెస్ట్‌

సారాంశం

కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు మోహన్ బాబు ఫాం హౌజ్‌ వాచ్‌ మెన్‌ బెదిరించారు. ఈ సంఘటనపై మోహన్‌ బాబు కుటుంబం కంప్లయింట్ ఇవ్వటంతో విచారణ చేపట్టిన పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారు మైలార్‌ దేవరపల్లి దుర్గా నగర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు.

శనివారం సాయంత్రం సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్‌ బాబు ఇంటి దగ్గర నలుగురు ఆగంతకులు కలకలం సృష్టించారు. కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు మోహన్ బాబు ఫాం హౌజ్‌ వాచ్‌ మెన్‌ బెదిరించారు. ఈ సంఘటనపై మోహన్‌ బాబు కుటుంబం కంప్లయింట్ ఇవ్వటంతో విచారణ చేపట్టిన పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారు మైలార్‌ దేవరపల్లి దుర్గా నగర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు.

శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఇంట్లోనుంచి ఓ బైక్‌ బయటకు వెళ్లేందుకు వాచ్‌ మేన్‌ ఫాంహౌజ్‌ పెద్ద గేటు తెరిచాడు. అదే సమయంలో ఓ కారు వేగంగా దూసుకువచ్చి ఇంట్లోకి ప్రవేశించింది. వాచ్‌ మెన్‌ ఆపేందుకు ప్రయత్నించటంతో అతపిపై బెదిరింపులకు దిగారు. దీంతో వెంటనే అక్కడు చేరుకున్న మోహన్‌ బాబు ఆయన పెద్ద కుమార్ విష్ణు, పోలీస్‌ కంప్లయింట్ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు