తనను కొట్టాడంటూ ఎన్టీఆర్ విలన్ పై కేసుపెట్టిన సొంత డ్రైవర్!

Published : Jan 18, 2021, 08:39 AM ISTUpdated : Jan 18, 2021, 08:45 AM IST
తనను కొట్టాడంటూ ఎన్టీఆర్ విలన్ పై కేసుపెట్టిన సొంత డ్రైవర్!

సారాంశం

మహేష్ మంజ్రేకర్ చర్యలకు మనస్థాపానికి గురైన కైలాష్ సత్ పుతే  అతనిపై పోలీసులకు పిర్యాదు చేశారు. తనను కొట్టడంతో పాటు, దుర్భాషలు ఆడినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డ్రైవర్ పిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. 

ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ పై కేసు నమోదు అయ్యింది. అయన తన కారు డ్రైవర్ ని కొట్టడంతో పాటు, అసభ్య పదజాలంతో దూషించడంతో అతనిపై పోలీసులు కంప్లైంట్ ఫైల్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం శుక్రవారం రాత్రి 11:30 నిమిషాల సమయంలో మహేష్ మంజ్రేకర్ ముంబై నుండి పూణే వెళుతున్నారు.  ఆ సమయంలో డ్రైవర్ కైలాష్ సత్ ఫుతే ఓ ప్రదేశంలో సడన్ బ్రేక్ వేయడం జరిగింది. 

దీనితో మహేష్ మంజ్రేకర్ కారును వెనుక వస్తున్న మరొక కారు ఢీకుంది. దీనితో ఆయన కారు వెనుక భాగం స్వల్పంగా డామేజ్ అయ్యింది. దీనితో ఆగ్రహానికి గురైన మహేష్ మంజ్రేకర్ డ్రైవర్ కైలాష్ సత్ పుతే ని కొట్టడం జరిగింది. అలాగే అతన్ని తీవ్రంగా దూషించారు. 

మహేష్ మంజ్రేకర్ చర్యలకు మనస్థాపానికి గురైన కైలాష్ సత్ పుతే  అతనిపై పోలీసులకు పిర్యాదు చేశారు. తనను కొట్టడంతో పాటు, దుర్భాషలు ఆడినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డ్రైవర్ పిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. 2010లో విడుదలైన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ అదుర్స్ మూవీలో మహేష్ విలన్ రోల్ చేశారు. దీనితో పాటు చాలా తెలుగు సినిమాలలో ఆయన విలన్ రోల్స్ చేయడం జరిగింది. 

PREV
click me!

Recommended Stories

Thanuja: ఇదీ తనూజ అసలు స్వరూపం, విన్నర్ అయ్యే ఛాన్స్ గోవిందా.. ఆమెకి ఎలివేషన్స్ ఇచ్చి వేస్ట్
Raktha Sambandham Review : ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి