'బిగ్ బాస్ 3' సెట్ లో పోలీసులు.. ఆమె అరెస్ట్ కి రంగం సిద్ధం!

Published : Jul 03, 2019, 10:21 AM IST
'బిగ్ బాస్ 3' సెట్ లో పోలీసులు.. ఆమె అరెస్ట్ కి రంగం సిద్ధం!

సారాంశం

ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్ కి అతడి కూతురు వనితతో ఆస్థి తగాదాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. 

ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్ కి అతడి కూతురు వనితతో ఆస్థి తగాదాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. తన ఇంటిని కూతురు బలవంతంగా లాక్కుందని వనితపై కేసు పెట్టారు. ఈ వివాదం మరింత ముదిరింది.

కొంతకాలం పాటు తండ్రితో గొడవపడిన వనిత.. భర్త నుండి విడిపోయిన తరువాత కూతురి విషయంలో అతడితో గొడవ పడుతున్నారు. ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా ఉన్న వనితను అరెస్ట్ చేయడానికి తెలంగాణా పోలీసులు చెన్నైకి చేరుకున్నారు. 2007 లో ఆనంద్ రాజ్ ను వివాహం చేసుకున్న వనిత 2012లో విడాకులు తీసుకున్నారు.

అప్పటినుండి కూతురు బాధ్యతల విషయానికి సంబంధించి వనిత, ఆనంద్ రాజ్ ల మధ్య వివాదం జరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వనిత తన కూతురిని చెన్నై తీసుకెళ్లి దాచిపెట్టినట్లుగా ఆనంద్ రాజ్ తెలంగాణా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వనితపై కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు అరెస్ట్ కి రంగం సిద్ధం చేశారు.

ఇప్పటికే బిగ్ బాస్ సెట్ ఉన్న ఈవీవీ ఫిలిం సిటీ ప్రాంతానికి చెందిన నజ్రత్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించిన తెలంగాణా పోలీసులు వనిత అరెస్ట్ కు సహకరించాల్సిందిగా కోరారు. ప్రస్తుతం బిగ్ బాస్ సెట్ లో ఉన్న వనితను తెలంగాణా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన