తెలుగు సినీ నటుడు నవీన్ రెడ్డి అరెస్ట్.. ఫోర్జరీ సంతకాలతో భారీ మోసం..

Published : Feb 04, 2023, 05:45 PM ISTUpdated : Feb 04, 2023, 05:50 PM IST
 తెలుగు సినీ నటుడు నవీన్ రెడ్డి అరెస్ట్.. ఫోర్జరీ సంతకాలతో భారీ  మోసం..

సారాంశం

తెలుగు సినీ నటుడు అట్లూరి నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ స్క్వేర్ కంపెనీలో నవీన్ రెడ్డి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 

తెలుగు సినీ నటుడు అట్లూరి నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ స్క్వేర్ కంపెనీలో నవీన్ రెడ్డి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే మిగిలిన డైరెక్టర్లకు తెలియకుండా నవీన్ రెడ్డి కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే బాధితులు నవీన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నవీన్ రెడ్డిపై పోలీసులు 420,465, 468, 471 ఆర్‌/డబ్ల్యూ, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

అనంతరం నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక, నవీన్ రెడ్డి హీరోగా నో బడి అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి ఆయనే నిర్మాతగా వ్యవహరించారు. ఇక, నవీన్ రెడ్డి స్వస్థలం సూర్యాపేట అని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Thrice Married Actresses: మూడు పెళ్లిళ్లు చేసుకున్న సౌత్ హీరోయిన్లు వీరే
మహేష్ బాబు వారణాసి తో పాటు 2026-27లో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే 3 భారీ సినిమాలు ?