The Kashmir Files:`ది కాశ్మీర్‌ ఫైల్స్` చిత్రానికి ప్రధాని మోడీ అభినందనలు..

Published : Mar 12, 2022, 09:19 PM IST
The Kashmir Files:`ది కాశ్మీర్‌ ఫైల్స్` చిత్రానికి ప్రధాని మోడీ అభినందనలు..

సారాంశం

`ది కాశ్మీర్‌ ఫైల్స్` చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. చిత్ర బృందం దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌, పల్లవి జోషి శనివారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. 

అనుపమ్‌ ఖేర్‌, దర్శన్‌ కుమార్‌, మిథున్‌ చక్రవర్తి, పల్లవి జోషి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `ది కాశ్మీర్‌ ఫైల్స్`(The Kashmir Files). వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో అభిషేక్‌ అగర్వాల్‌, వివేక్‌ అగ్నిహోత్రి, పల్లవి జోషి, జీ స్టూడియో  నిర్మించారు. ఈసినిమా శుక్రవారం(మార్చి 11)న విడుదలైంది. తాజాగా ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తుంది.

1990 దశకంలో కశ్మీర్‌లో జరిగిన దారుణ మారణ హింసాకాండని ఆధారంగా చేసుకుని దర్శకుడు వివేక్‌అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని రూపొందించారు.  90వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి  జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపమే ఈ సినిమా. 1990లో హిందు పండిత్స్ పై అప్పటి వరకు అక్కడే వారితో కలిసి మెలిసి తిరిగిన కొంత మంది వేరే మతానికి చెందిని వారు అక్కడ స్థానిక హిందూవుపై  దారుణ మారుణ కాండకు పాల్పడ్డరు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వారికి అక్కడ నిలువ నీడ లేకుండా చేసి స్వదేశంలోనే శరణార్ధులుగా అయ్యేలా చేశారు.  ఈ యదార్థ సంఘటనలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదలై మంచిస్పందనతో దూసుకుపోతుంది. తొలి రోజు దేశ వ్యాప్తంగా దాదాపు మూడున్నర కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. 

తాజాగా ఈ చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అభినందించారు. చిత్ర బృందం దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌, పల్లవి జోషి శనివారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. ఈ సినిమా గురించి మోడీకి వివరించగా, ఆయన సినిమాని, చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా యూనిట్‌ తమ సంతోషాన్ని పంచుకుంది. ప్రధాని మోడీ ప్రశంసలు, ఆయన ఆశీస్సులు అందుకోవడం గర్వంగా ఉందని పేర్కొంది. అంతేకాదు మోడీతో దిగిన ఫోటోలను పంచుకున్నారు.  

ఈ సందర్భంగా ప్రధానిని నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ శాలువాతో సత్కరించడం విశేషం. ఈ సినిమాకి తెలుగులోనూ మంచి స్పందన లభిస్తుందని నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ తెలిపారు. అయితే సినిమాని నిలిపివేయాలని కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు కాగా, కోర్ట్ ఆ పిటిషన్‌ కొట్టేస్తూ సినిమా విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో శుక్రవారం సినిమాని విడుదల చేసింది యూనిట్‌. అవాంతరాలను దాటుకుని విడుదలైన `ది కాశ్మీర్‌ ఫైల్స్` చిత్రానికి మంచి స్పందన రావడం పట్ల యూనిట్‌ హర్షం వ్యక్తం చేస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు