NTR New Movie Announcement: బుచ్చిబాబుతో ఎన్టీఆర్ మూవీ అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే...?

Published : Mar 12, 2022, 08:21 PM IST
NTR New Movie Announcement: బుచ్చిబాబుతో ఎన్టీఆర్ మూవీ అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే...?

సారాంశం

ట్రిపుల్ ఆర్ వల్ల మూడేళ్లు గ్యాప్ రావడంతో వరుసగా సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నాడు ఎన్టీఆర్. ఒకదాని వెంట మరొకటి సెట్స్ ఎక్కిస్తున్నాడు. 

ట్రిపుల్ ఆర్ ఈనెల 25న రిలీజ్ కాబోతోంది. మూడు సార్లు రిలీజ్ వాయిదా పడ్డ ఈమూవీ నాలుగో సారి పక్కాగా రిలీజ్ క స్కెచ్ వేసుకుంది టీమ్. ఇక ఈ సినిమా కోసం మూడేళ్లు త్యాగం చేశాడు ఎన్టీఆర్ 2018 లో వచ్చిన అరవింద సమేత తరువాత తారక్ నుంచి సినిమా రానేలేదు. ఇక ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ సినిమ కోసం మంచి ఆకలితో ఎదురు చూస్తున్నారు. అందుకే ఇన్నేళ్ల గ్యాప్ ను ఇక వరుస సినిమాలతో కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. 

ఈ క్రమలోను ట్రిపుల్ ఆర్ తరువాత కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు తారక్. ఆతరువాత ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబుతో  తరువాత కేజియఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా మూవీకి రెడీ అవుతున్నాడు.ఎన్టీఆర్ తో బుచ్చిబాబు ఒక సినిమా చేయనున్నాడనే టాక్ చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. బుచ్చిబాబు వినిపించిన కథ ఎన్టీఆర్ కీ నచ్చిందనీ.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుచ్చి కథను కూడా రెడీ చేసుకున్నాడని సమాచారం. 

ఇక ఈ ఏడాదిలోనే  సినిమా పట్టాలెక్కనుందనేది ఇండస్ట్రీ టాక్. అయితే ఇందులో నిజమెంత అనేది అఫీషల్ గా అనౌన్స్ మెంట్ వచ్చేవరకూ తెలియాలి. ఒక్కోసారి ఈ కాంబో టాక్ కేవలం రూమర్ మాత్రమే అని కొట్టిపడేసేవారు కూడా ఉన్నారు.  అయితే నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు అని తెలుస్తోంది. 

అంతే కాదు ఇప్పుడు వినిపిస్తున్న మరో రూమర్ ఏంటీ అంటే ట్రిపుల్ ఆర్ ఈనెలలో రిలీజ్ అవుతుంది కాబట్టి.. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ను వచ్చే నెల అంటే ఏప్రిల్ 11న చేయబోతున్నట్టు సమాచారం. ఆ రోజునే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక సమాచారంతో పాటు మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది.  

ట్రిపుల్ ఆర్ తరువాత తారక్  కొరటాలతో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాత బుచ్చిబాబుతో చేయవచ్చునని అందరూ  అనుకున్నారు. కాని అనూహ్యంగా ఇప్పుడు  కొరటాల సినిమాతో పాటే బుచ్చిబాబు సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేసే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్టు తులుస్తోంది. ఇక బుచ్చిబాబుతో చేయబోయే సినిమా  స్పోర్ట్స్  బ్యాగ్రౌండ్ లో రూపొందుతుందని సమాచారం.. అంతే కాదు ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. 
 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన