హాలీవుడ్ లో విషాదం, కన్నుమూసిన పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ నటుడు సెర్గియా కాల్డెరాన్

Published : Jun 02, 2023, 01:11 PM ISTUpdated : Jun 02, 2023, 01:18 PM IST
హాలీవుడ్ లో విషాదం, కన్నుమూసిన పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ నటుడు సెర్గియా కాల్డెరాన్

సారాంశం

ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. మన టాలీవుడ్.. బాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లో కూడా వరుసగా స్టార్స్ ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా ఫేమస్ యాక్టర్ ఒకరు కన్నుమూశారు. 

టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు వరుస మరణాలు సినీ పరిశ్రమను కలవరపెడుతున్నాయి. ఈమధ్య కాలంలోనే  ఎంతో మంది నటులు, టెక్నీషియన్స్ ను కోల్పోయింది సినీకాళామతల్లి. సీనియర్ నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు, టెక్నీషియన్లు ఇలా ఎంతో మంది స్టార్లు కన్నుమూశారు. అయితే ఈమధ్య హాలీవుడ్ నుంచి ఎక్కువ నటుల మరణాలు సంభవిస్తున్నాయి. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్రిటిష్‌ గవర్నర్‌ మిస్టర్‌ స్కాట్‌ పాత్రలో నటించిన హాలీవుడ్‌ నటుడు రే స్టీవెన్సన్‌ మరణించారు. తరువాత ప్రముఖ పాప్ సింగర్ మరణించగా.. తాజాగా మరో హాలీవుడ్ స్టార్ యాక్టర్ కన్నుమూశారు. 

హాలీవుడ్ యాక్టర్ పైరేట్స్ ఆఫ్ కరేబియన్ ఫేమ్..  ప్రముఖ నటుడు సెర్గియా కాల్డెరాన్ మరణించారు. 77 సంత్సరాల సెర్గియో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు.  1945లో జన్మించిన అతడు. 1970 నుంచి తన నటన జీవితాన్ని మొదలు పెట్టారు. సినిమాలు మాత్రమే కాదు  టీవీ షోల్లో పలు పాత్రలు పోషించారు. 1984లో జాన్ హస్టన్ దర్శకత్వం వహించిన అండర్ ది వాల్కనో, టీవీషో ది ఎ-టీమ్, కామెడీ సిరీస్ ‘ది ఇన్-లాస్’లో నటించారు. ఇలా హాలీవుడ్ లో చాలా సినిమాల్లో.. వెబ్ సిరీస్  లలో.. నటించి మెప్పించారు. 

ఆయన ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత కష్టపడ్డా.. సెర్గియో కు మంచి పేరు తీసుకువచ్చింది మాత్రం మెన్  ఇన్ బ్లాక్, పైరేట్స్ ఆఫ్ ద కరేమియన్. ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్- ఎట్ వరల్డ్స్ ఎండ్ సినిమాలు మాత్రమే.ఆ సినిమాలో పైరేట్ లార్డ్స్‌లో ఒకరైన అడ్రియాటిక్ సముద్రానికి చెందిన కెప్టెన్ ఎడ్వర్డో విల్లాన్యువా పాత్రను కాల్డెరన్  పోషించారు. ఈసినిమాత తో పాటు ఆయన ఎన్నో సినిమాల్లో తన మార్క్ చూపిస్తూ.. హాలీవుడ్ స్టార్ గా ఎదిగారు. గత ఏడాడది ఎఫ్ఎక్స్ సిరీస్ బెటర్ థింగ్స్ చివరి సీజన్‌లో కూడా కనిపించారు. అతనికి భార్య, కొడుకు, తో పాటు  ముగ్గురు మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..