
తన తదుపరి చిత్రంలో న్సీ కాంబినేషన్ లు కానీ ,మల్టిస్టారర్ కాని లేదని తెలియచేసారు. ఇలాంటి ఊహాగానాలు అంతా మానుకోవాలని ఆయన సూచించారు. ఇక దూకుడు చిత్రంలో ఎమ్మెల్యేగా కనిపించి ఆకట్టుకున్న మహేష్ కొరటాలతో వస్తున్న తదుపరి చిత్రంలో ముఖ్యమంత్రిగా కనిపిస్తారని తెలుస్తోంది. సామాజిక సమస్యను మాస్ మసాలా జోడించి తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు కొరటాల మహేష్‌తో రూపొందించబోయే తాజా చిత్రాన్ని కూడా ఓ పవర్‌ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ కథతో సెట్స్‌పైకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట.
ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడని, ఆయన పాత్ర శక్తివంతంగా వుంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ స్థాయిలో తెరకెక్కించనుంది. మహేష్‌బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. 90 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే కొరటాల శివ దర్శకత్వంలో రానున్న మహేష్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.