''అల్లు అరవింద్, దిల్ రాజు కుక్కలా..?''

By Udayavani DhuliFirst Published Jan 7, 2019, 10:39 AM IST
Highlights

ఈ కుక్కలకు బుద్ధి చెబుతాం.. అల్లు అరవింద్, దిల్ రాజులపై 'పేట' ప్రొడ్యూసర్ ఫైర్

రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లు ప్రముఖ నిర్మాతల చేతుల్లోనే ఉంటాయని, వారు చెప్పినట్లుగానే సినిమాలకు థియేటర్లు కేటాయిస్తారనే వాదన ఇండస్ట్రీలో ఉంది. మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. 'పేటా' సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోన్న నిర్మాత అశోక్ వల్లభనేని అల్లు అరవింద్, దిల్ రాజు, యువి క్రియేషన్స్ వారిపై మండిపడ్డాడు.

వారిని కుక్కలతో పోలుస్తూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్ 2 సినిమాలతో పాటు 'పేటా' కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అయితే మూడు స్ట్రెయిట్ సినిమాల ముందు రజినీకాంత్ 'పేటా' చిత్రానికి థియేటర్లు దొరకడం లేదట.

ఈ విషయంపై స్పందించిన నిర్మాత అశోక్ వల్లభనేని.. అల్లు అరవింద్, దిల్ రాజు, యువి క్రియేషన్స్ వారు తనకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నట్లు  వెల్లడించారు. వీరంతా థియేటర్లతో పుట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని అన్నాడు. 'పేటా' సినిమాకి థియేటర్లు ఇవ్వడానికి ఈ నిర్మాతలకు నొప్పేంటి..? అని ప్రశ్నించాడు.

వందలాది థియేటర్లలో ఒకే సినిమా వేరి మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్లు ఇవ్వకుండా నాటకాలు  ఆడుతున్నారా..? అని ఫైర్ అయ్యాడు. వీళ్లు వేసే సినిమాలే చూడాలా..?  బలవంతగా సినిమాలకు మనపై రుద్దుతూ ఉంటే చూస్తుంటామా..? ఈ కుక్కలకు బుద్ధి చెబుతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రజాభిమానంతో గెలిచారు.. ఎవరో నయీంని చంపారు.. థియేటర్ల మాఫియాని ఎందుకు షూట్ చేయరు..? అంటూ తన ఆవేదనను వెళ్ళగక్కాడు.  

click me!