ది ఘోస్ట్ కు నాగార్జున తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? వింటే షాక్ అవుతారు.

Published : Sep 30, 2022, 02:06 PM IST
ది ఘోస్ట్ కు నాగార్జున తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? వింటే షాక్ అవుతారు.

సారాంశం

అరవై ఏళ్ళు దాటినా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు టాలీవుడ్  కింగ్‌ నాగార్జున. ప్రస్తుతం ది ఘోస్ట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి నాగార్జున తీసుకున్న రెమ్యూనరేషన్ షాకింగ్ గా ఉంది.  

అరవై ఏళ్ళు దాటినా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు టాలీవుడ్  కింగ్‌ నాగార్జున.  ప్రస్తుతం వరుసగా సినిమాలు సెట్స్‌ పైకి తీసుకెళ్తున్నాడు. ఈ ఏడాది బంగార్రాజుతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన నాగ్ ..సంక్రాంతికి శుభప్రదంగా విజయం సాధించాడు. ఇక ఈ విజయ దశమికి మరో విజయాన్ని అందుకోవడం కోసం ప్లాన్ వేశాడు నాగార్జున   అదే జోష్‌లో ది ఘోస్ట్ సినిమాతో ఆడియన్స్  ముందుకు వస్తున్నాడు. 
 
గుంటూరు టాకీస్ , గ‌రుడ వేగ సినిమాల ఫేం ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంతో ది ఘోస్ట్ మూవీలో  నటించాడు నాగ్. యాక్షన్ బయాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన ఈసినిమా అక్టోబర్ 5న ద‌స‌రా కానుక‌గా విడుదల కానుంది. ఇక ఇప్ప‌టికే మూవీ నుండి విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో వరుసగా ప్రమోషన్లతో అదరగొడుతున్నారు టీమ్. సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం నాగార్జున ఎంత  రెమ్యూరేషన్‌ తీసుకుని ఉంటాడు.. అని అందరిలో చిన్న డౌట్ ఉంది. ఫిల్మ్ సర్కిల్ లో కూడా ఈచర్చ జరుగుతోంది. ఇక ఆయన రెమ్యూనరేషన్ పై ఓవార్త  నెట్టింట వైరల్‌గా మారింది.ది ఘోస్ట్‌  సినిమాలో నటించినందుకు నాగార్జున రెమ్యునరేషన్‌గా కొన్ని ఏరియా కలెక్షన్లు తీసుకోనున్నాడట. తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం వైజాగ్‌, ఈస్ట్‌, వెస్ట్‌, గుంటూరు వంటి నాలుగు ఏరియాల కలెక్షన్లు ఆయన పారితోషికంగా తీసుకోనున్నాడట. 

అంతేకాకుండా ది ఘోస్ట్‌ మూవీలో భాగస్వామిగా ఉన్న నాగార్జున ఈసినిమాను  అన్నపూర్ణ స్డూడీయోస్‌పై స్వయంగా రిలీజ్‌ చేస్తున్నాడు. దిఘోస్ట్ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు కింగ్. ఈ మూవీలో  నాగార్జున ఇంట‌ర్‌పోల్ ఆఫిస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారట. 

ఇక ఇందులో టాలీవుడ్ మన్మథుడి సరసన యంగ్ బ్యూటీ... సోనాల్ చౌహన్ హీరోయిన్‌గా నటించింది.  శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై సునీల్ నారంగ్‌, పుస్కురి రామ్‌మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ ది ఘోస్ట్ మూవీని నిర్మించారు.

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా