'వాల్మీకి' పై హోకోర్టులో పిటిషన్‌!

Published : Aug 26, 2019, 04:07 PM IST
'వాల్మీకి' పై హోకోర్టులో పిటిషన్‌!

సారాంశం

వాల్మీకి సినిమా టైటిల్‌ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బోయ వాల్మీకిల మనోభావాలను దెబ్బ తీసే విధంగా చిత్రాన్ని రూపొందించారని, సినిమా టైటిల్‌ మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని బోయ హక్కుల సమితి పిటిషన్‌ దాఖలు చేసింది.   

సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఓ వివాదం సినిమాను వెంటాడుతూనే ఉంది. గ్యాంగ్‌స్టర్‌ సినిమాకి 'వాల్మీకి' అనే టైటిల్ ఎలా పెడతారంటూ బీసీ సంక్షేమ సంఘాలు గొడవకి దిగుతున్నాయి. వాల్మీకి సినిమా పేరునువెంటనే మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.

గతంలో బోయ సంఘాలు తమ కులానికి చెందిన వ్యక్తి పేరుని టైటిల్ గా పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ షూటింగ్ జరక్కుండా అడ్డుకున్నాయి. ఇటీవల కూడా టైటిల్ మార్చాలని ధర్నా చేపట్టారు. అయితే చిత్రబృందం మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించడం లేదు.

సెప్టెంబర్ 13న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేసింది. దీంతో బోయ హక్కుల సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

బోయ వాల్మీకిల మనోభావాలను దెబ్బ తీసే విధంగా చిత్రాన్ని రూపొందించారని, సినిమా టైటిల్‌ మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరారు. తమ కులస్థులను కించపరిచేలా  సినిమా తీసిన చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.  పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ పై నిర్మించారు. 

PREV
click me!

Recommended Stories

రష్మిక మందన్న పాత జ్ఞాపకాలు, 2025 నేషనల్ క్రష్ కు ఎలా గడిచింది? వైరల్ ఫోటోస్
తల్లి కాబోతున్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ హీరోయిన్, బేబీ బంప్ ఫోటోస్ వైరల్