తన క్లాసిక్‌ `పెళ్లిసందడి`కి 25ఏళ్లు.. రాఘవేంద్రరావు ఎమోషనల్‌..త్వరలోనే `పెళ్లిసందd`..

Published : Jan 12, 2021, 11:06 AM ISTUpdated : Jan 12, 2021, 11:34 AM IST
తన క్లాసిక్‌ `పెళ్లిసందడి`కి 25ఏళ్లు.. రాఘవేంద్రరావు ఎమోషనల్‌..త్వరలోనే `పెళ్లిసందd`..

సారాంశం

శ్రీకాంత్‌ హీరోగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన సూపర్‌ హిట్‌ `పెళ్లిసందడి`. తాజాగా ఈ సినిమా నేటి(మంగళవారం)తో 25ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు తన ఆనందాన్ని పంచుకుంటూ ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. 

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో `పెళ్లిసందడి` ఒకటి. శ్రీకాంత్‌, రవళి, దీప్తి భట్నాగర్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌ నిర్మించిన ఈ సినిమా జనవరి 12, 1996లో సంక్రాంతి కానుకగా విడుదలై విశేష ఆదరణ పొందింది. తాజాగా ఈ సినిమా నేటి(మంగళవారం)తో 25ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు తన ఆనందాన్ని పంచుకుంటూ ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. 

`పెళ్లి సందడి` నేటికి సినిమా విడుదలై 25ఏళ్లు అయ్యింది. నా కెరీర్‌లో, శ్రీకాంత్‌ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనేనిలిచపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణికి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్‌, అల్లు అరవింద్‌, జగదీష్‌ ప్రసాద్‌లకు నమస్కరిస్తున్నాను` అని ట్వీట్‌ చేశారు రాఘవేంద్రరావు.  ఇక ఈ సినిమా మూడు నంది అవార్డులను గెలుచుకుంది. అంతేకాదు హిందీలో, తమిళంలో రీమేక్‌ కూడా చేశారు. అక్కడ కూడా ఆకట్టుకుంది. 

ఇందులో పాటలు ఎంతగా పాపులర్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `సౌందర్యలహరి.. స్వప్న సుందరి..`, `రమ్యకృష్ణ లాగ ఉంటదా..`, `హృదయమనే కోవెలలో వెలిగే దీపం..`, `సరిగమ పదనిస రాగం..`,  `నవమన్మథుడా.. అతి సుందరుడా..` పాటలను వింటే ఇప్పటికే మనసు ఉల్లాసాన్ని పొందుతుంది. సరికొత్త అనుభూతికి లోనవుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నారు రాఘవేంద్రరావు. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా `పెళ్లిసందd`ని రూపొందించబోతున్నట్టు ప్రకటించారు. దీనికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండగా, ఆయన సహాయకురాలు గౌరీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నట్టు తాజాగా వెల్లడించారు. చివరగా `ఓం నమోవెంకటేశాయ` చిత్రాన్ని నాగార్జున హీరోగా రూపొందించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bharani: తన ఒరిజినాలిటీ బయటపెట్టిన భరణి.. మెగా బ్రదర్‌ నాగబాబు స్ట్రాటజీ పనిచేస్తుందా?
Akira Nandan నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? రేణు దేశాయ్‌ ఫోన్‌ చేస్తే పవన్‌ క్రేజీ రియాక్షన్‌