‘సలార్’ గురించి అదిరిపోయే అప్ డేట్

By Surya Prakash  |  First Published Jan 12, 2021, 9:05 AM IST

ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా షూటింగ్‎లో బిజీగా ఉన్నాడు. దాదాపు ఆ మూవీ చిత్రీకరణ పూర్తి దశకు చేరుకుంది. రాదేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ షూటింగ్‏లో పాల్గొననున్నాడు. దీంతోపాటు ఈ నెలలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ సినిమా షూటింగ్‏లో పాల్గోననున్నట్లుగా తెలుస్తోంది. 


ప్రభాస్ హీరోగా నటిస్తున్న అనేక భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో   ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. ఈ సినిమా అనౌన్స్ చెయ్యడంతో దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున అటెన్షన్ ను సంతరించుకుంది . ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం కానుంది. ప్రభాస్ షూట్ లో ఎప్పటినుంచి పాల్గొనబోతున్నాడనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. 

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. గత రెండున్నరేళ్లగా షూటింగ్ జరుపుకుంటున్న రాధే శ్యామ్ చిత్రం లో ప్రభాస్ పార్ట్ ఈ నెల 13 షూట్ పూర్తవుతుంది. కొద్దిపాటి బ్రేక్ తీసుకుని ఈ నెల 22 నుంచి సలార్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
 
 మరో ప్రక్క “కేజీఎఫ్” చిత్రాలకు తనతో వర్క్ చేసిన టెక్నీషియన్లనే ఆయన ప్రభాస్ సినిమాకి కూడా రిపీట్ చేస్తున్నాడు. “కేజీఎఫ్” సినిమాకి టెర్రిఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రవి బస్రుర్ కే ప్రభాస్ సినిమాకి బాధ్యతలు అప్పగించాడు ప్రశాంత్ నీల్.   ఇప్పటికే సినిమాకి సంబందించిన మ్యూజిక్ వర్క్ మొదలుపెట్టేసారట. అలాగే ఈ సినిమాకి కెమెరా మేన్ కూడా “కేజీఎఫ్”కి వర్క్ చేసిన భువన్ గౌడ పని చేయనున్నాడు. హీరోయిన్, ఇతర నటులు తప్ప… మిగతా టీం అంతా ప్రశాంత్ నీల్ తో తొలినుంచి పనిచేస్తున్నవారే ఉంటారని చెప్తున్నారు.

Latest Videos

 ఇక ఈ సినిమా టైటిల్ అర్ధం దర్శకుడు నీల్ రివీల్ చేసారు. సలార్ అంటే ఒక రాజుకు రైట్ హ్యాండ్ అని చెప్పాడు. ‘మోస్ట్‌ వయోలెంట్‌ మ్యాన్‌.. కాల్డ్‌ వన్‌ మ్యాన్‌... ది మోస్ట్‌ వయోలెంట్‌.. సినిమా మీద ప్రేమతో భాషల హద్దులను చెరిపేస్తూ.. భారతీయ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం.. ప్రభాస్‌ గారికి హృదయపూర్వక స్వాగతం’ అంటూ ప్రశాంత్ నీల్ పోస్టులో పేర్కొన్నారు.  హొంబెల్‌ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. కేజీఎఫ్‌,  కేజీఎఫ్‌ 2ను నిర్మించిన విజయ్‌ కిరుగందుర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ వెనుక ఉన్న హోంబాలే చిత్రాలు ఈ చిత్రాన్ని బ్యాంక్రోలింగ్ చేస్తున్నాయి.
 
ఇక గతంలో కన్నడ లో ప్రశాంత్ నీల్ చేసిన ఉగ్రం అనే సినిమా సూపర్ హిట్. ఆ సినిమానే ఇప్పుడు ప్రభాస్ తో తీస్తాడని వార్తలు వస్తున్నాయి. 2014లో విడుదలైన ఈ సినిమా కన్నడ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది. అందులో హీరో కూడా ఒక గ్యాంగ్ లీడర్ గానే కనిపిస్తాడు. ఫ్యామిలీ యాంగిల్ కూడా కలగలపి ఉండే కంప్లీట్ మాస్ చిత్రం ఉగ్రం. ఆ స్క్రిప్టుకే కాస్తంత మెరుగులు దిద్ది ప్రబాస్ తో చేయబోతున్నాడని చెప్తున్నారు.
 
 సలార్‌ సినిమాలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక వచ్చే ఏడాది జవవరిలో సలార్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.‘మేం ప్రస్తుతం చేస్తున్న ‘కేజీయఫ్‌ 2’ మీద చాలా అంచనాలు ఉన్నాయని తెలుసు. వాటన్నింటినీ మించేలా ఈ సినిమా ఉంటుంది. అలానే మా తదుపరి సినిమా కూడా ప్యాన్‌ ఇండియన్‌ సినిమాయే. అన్నారు.
 

click me!