వైరల్ వీడియో: హీరోయిన్ పై నెమలి దాడి

Published : Apr 12, 2021, 02:44 PM IST
వైరల్ వీడియో: హీరోయిన్ పై నెమలి దాడి

సారాంశం

 పొడవాటి పింఛాలతో అందంగా ఉన్న నెమలిని మచ్చిక చేసుకుందాం అని దగ్గరకు వెళ్ళింది దిగంగన. ఆ నెమలి ఏ మూడ్ లో ఉందో తెలియదు గానీ, ఒక్కసారిగా ఆమెపైకి ఎగిరింది. దీనితో దిగంగన భయపడి కేకలు వేసుకుంటూ వెనక్కి వెళ్లారు.   

సరదా పడి నెమలి దగ్గరకు వెళితే, అదికాస్తా ఎగిరి తన్నింది. హీరోయిన్ దిగంగనా సూర్యవంశీకి ఈ షాకింగ్ ఘటన ఎదురైంది. పొడవాటి పింఛాలతో అందంగా ఉన్న నెమలిని మచ్చిక చేసుకుందాం అని దగ్గరకు వెళ్ళింది దిగంగన. ఆ నెమలి ఏ మూడ్ లో ఉందో తెలియదు గానీ, ఒక్కసారిగా ఆమెపైకి ఎగిరింది. దీనితో దిగంగన భయపడి కేకలు వేసుకుంటూ వెనక్కి వెళ్లారు. 


ఈ వీడియోని ఒకరు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతుంది. దిగంగన చేతులకు చిన్నపాటి గాయాలు అయినట్లు సమాచారం. తెలివిజన్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన దిగంగన వెండితెర ఎంట్రీ ఇచ్చారు. చిన్నతనంలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని పాత్రలు చేశారు. తెలుగులో దిగంగన, కార్తికేయ హీరోగా తెరకెక్కిన హిప్పీ మూవీలో నటించారు. అలాగే వలయం మూవీలో కూడా ఆమె హీరోయిన్ గా చేయడం జరిగింది. 


ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సీటీమార్ మూవీలో దిగంగన నటిస్తున్నారు. దర్శకుడు సంపంత్ నంది తెరకెక్కిస్తున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, ఆమె లేడీ కబడ్డీ కోచ్ రోల్ చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Maheshbabu Reality: మహేష్‌ బాబు రియాలిటీ బయటపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. ఆయనతో వ్యవహారం అలా ఇలా ఉండదట
Killer Movie Accident: ఎస్‌జే సూర్య సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం, ఒకరి మృతి.. అసలేం జరిగిందంటే?