ఎంతిచ్చినా.. ఓకే అంటున్న పాయల్!

By AN TeluguFirst Published 22, May 2019, 4:28 PM IST
Highlights

'RX 100' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన నటి పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటోంది. 

'RX 100' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన నటి పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటోంది. ఆమె కాల్షీట్స్ ఇప్పటికీ చాలా బిజీ. వరుసగా అవకాశాలు వస్తున్నాయంటే ఎవరైనా తమ డిమాండ్ కాస్త పెంచుకుంటారు.

చిన్న సినిమాలు ఒప్పుకోకపోవడం, రెమ్యునరేషన్ ఎక్కువ అడగడం వంటివి చేస్తుంటారు. కానీ పాయల్ మాత్రం అలాంటి పనులు చేయడం లేదట. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎవరు కథలు చెబుతున్నా వింటోందట. పాత్ర నచ్చితే సినిమా చేయడానికి రెడీ అవుతోందట.

అంతేకాదు.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కోసం పాయల్ ని ఎక్కువగా సంప్రదిస్తుంటారు. ఆమెకు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడున్న ఒకట్రెండు సినిమాలు చేసిన హీరోయిన్లు సైతం మాల్ ఓపెనింగ్ కోసం 5 నుండి 8 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. 

కానీ పాయల్ మాత్రం కేవలం మూడు లక్షలకే ఒప్పుకుంటుందట. అలా వచ్చిన డబ్బుతోనే ఈ బ్యూటీ ముంబైలో ఓ ఫ్లాట్ కూడా కొనుక్కుందట. హీరోయిన్ల లైఫ్ స్పాన్ ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రేజ్ ఉన్నప్పుడే డబ్బు సంపాదించుకుంటుంది ఈ బ్యూటీ. 

Last Updated 22, May 2019, 4:28 PM IST