నందు ప్రవర్తనపై నిర్మాతల గుస్సా!

Published : Aug 21, 2018, 01:04 PM ISTUpdated : Sep 09, 2018, 12:52 PM IST
నందు ప్రవర్తనపై నిర్మాతల గుస్సా!

సారాంశం

చిన్న చిత్రాల్లో హీరోగా, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తోన్న నందు తమకు చుక్కలు చూపిస్తున్నాడని అంటున్నారు అతడితో సినిమా చేసిన నిర్మాతలు.

చిన్న చిత్రాల్లో హీరోగా, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తోన్న నందు తమకు చుక్కలు చూపిస్తున్నాడని అంటున్నారు అతడితో సినిమా చేసిన నిర్మాతలు. నందు ప్రధాన పాత్రలో 'ఐందవి' అనే హారర్ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది. దీనికి నందు హాజరు కాలేదు. ఈ సందర్భంలో నిర్మాత శ్రీధర్.. నందు తమతో ప్రవర్తిస్తున్న తీరుపై మండిపడ్డారు.

చాలా రోజులుగా నందు తమకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు. 'తెలుగు సినిమా పరిశ్రమలో దురదృష్టకరమైన విషయం కనిపిస్తుంది. మా సినిమాలో హీరోగా నటించిన నందు ఆడియో ఫంక్షన్ కి రాకపోవడం చాలా దారుణం. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన దర్శక నిర్మాతలకు అండగా ఉండాల్సింది పోయి ఇలా ప్రవర్తించడం సరకాదు. నందు పెద్ద హీరో కాడు..

స్థాయి ఏదైనా సరే అతడిని నమ్మి సినిమా చేసిన నిర్మాతలకు గౌరవం ఇవ్వాలి. ఎంతో డబ్బు పెట్టి సినిమా తీయమంటే మామూలు విషయం కాదు. అలాంటిది అతడు సినిమా ప్రమోషన్స్ కి సహకరించకపోవడం బాధ్యతారాహిత్యం' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ నందు తన నిర్మాతలతో ఈ విధంగా ప్రవర్తించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

PREV
click me!

Recommended Stories

55 ఏళ్ల వయసులో 300 సినిమాలు, 200 కోట్లకు పైగా ఆస్తి, స్టార్ డైరెక్టర్ ను పెళ్లాడిన హీరోయిన్ ఎవరు?
Boyapati Sreenu: చిరంజీవితో బోయపాటి సినిమా ఎందుకు చేయలేదో తెలుసా ? బాలకృష్ణ అఖండ వల్ల అంత జరిగిందా..