అన్న చిరుని పవన్ రిక్వెస్ట్ చేసి.. వాడేస్తారా?

By Surya PrakashFirst Published Apr 6, 2020, 7:07 AM IST
Highlights

 కరోనా కారణంగా అనేక పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో గందరగోళం ఏర్పడబోతుందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒకరు అనుకున్న రిలీజ్ డేట్ ని మరొకరు ముందుకెళ్లాల్సిన సిట్యువేషన్ నెలకొంది. 


కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో రెండు మూడు నెలల వరకు థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదనేది వాస్తవం. కరోనా కారణంగా అనేక పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో గందరగోళం ఏర్పడబోతుందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒకరు అనుకున్న రిలీజ్ డేట్ ని మరొకరు ముందుకెళ్లాల్సిన సిట్యువేషన్ నెలకొంది. ఇప్పుడు తన అన్న మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఆచార్య కోసం అట్టిపెట్టుకున్న రిలీజ్ డేట్ ని తమ్ముడు పవన్ కళ్యాణ్ తన చిత్రం కోసం వాడుకోబోతున్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే... కరోనా వైరస్ విజృంభణ,లాక్ డౌన్ లతో పవన్ కళ్యాణ్ తాజా చిత్రం వకీల్ సాబ్ షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమాకు సంభందించి సెకండాఫ్ లో వచ్చే  పవన్ కళ్యాణ్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని షూట్ చేయాలి.  అతి తొందర్లోనే కరోనా రిలీఫ్ ఇచ్చాక షూట్ ఫినిష్ చేస్తారు. దిల్ రాజు ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ,రిలీజ్ డేట్ కోసం రకరకాల ఆప్షన్స్ వెతుకుతున్నారు.  మొదట ప్లాన్ చేసినట్లుగా వకీల్‌ సాబ్‌ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయాల్సి ఉంది.  కానీ ఇప్పుడది కుదరదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనో ప్రపోజల్ పవన్ దగ్గర పెట్టినట్లు చెప్తున్నారు. ఆయన చిరంజీవితో ఓ మాట చెప్పి...ఆ డేట్ ని ఫిక్స్ చేయించాలని ఆలోచన. 

వాస్తవానికి ఆగస్ట్ 14 వ తేదీన చిరంజీవి తాజా చిత్రం ఆచార్య ని విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో అది సాధ్యం కాదని తేలిపోయింది. దాంతో ఆచార్య చిత్రం ఆగస్టు 14న విడుదల కాని పక్షంలో ఆ తేదీలో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’ చిత్రాన్ని విడుదల చేసేందుకు దిల్‌ రాజు...పవన్ ని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. 
 

click me!