ముంబయి హార్బర్‌లో సుజీత్ తో పవన్‌.. ఏం జరుగుతుంది?.. `ఓజీ` ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌..

By Aithagoni Raju  |  First Published Feb 16, 2024, 3:27 PM IST

పవన్‌ కళ్యాణ్‌, సుజీత్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ `ఓజీ`. దీన్నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. తాజాగా పంచుకున్న ఫోటో వైరల్‌ అవుతుంది. 


పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న చిత్రాల్లో అత్యంత హైప్‌ ఉన్న మూవీ `ఓజీ`. ఈ మూవీ ఇంకా షూటింగ్‌ పూర్తి కాలేదు, కానీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. అంతేకాదు బ్యాక్‌ టూ బ్యాక్‌ అప్‌డేట్లు ఇస్తూ దుమ్ములేపుతున్నారు నిర్మాత. సోషల్‌ మీడియాలో పోస్ట్ లతో రచ్చ చేస్తున్నారు. తాజాగా ఫోటోని పంచుకున్నారు. ఆ ఫోటో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. మరి ఇంతకి నిర్మాతలు పంచుకున్న ఫోటో ఏంటి? అందులో ఏముంది. 

దర్శకుడు సుజీత్‌తో కలిసి పవన్‌ ఉన్న ఫోటోని పంచుకున్నారు. సుజీత్‌పై పవన్‌ చేతులు వేసినట్టుగా ఈ ఫోటో ఉంది. ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారు. అది ముంబయిలోని హార్బర్‌ ప్రాంతంలో కావడం విశేషం. `ముంబయి.. హార్బర్‌.. `ఓజీ`` అని పేర్కొంటూ ఈ ఫోటోని షేర్‌ చేశారు. ఇందులో ఇద్దరు బ్యాక్‌ నుంచి కనిపిస్తుండటం విశేషం. అయితే ఈ వెనుకున్న అర్థమేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Latest Videos

ముంబయిలో షూటింగ్‌కి ప్లాన్‌ జరుగుతుందా? లేక గతంలో షూటింగ్‌ చేసిన సమయంలో దిగిన ఫోటోనా? అనే సందేహం కలుగుతుంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించిన అప్‌డేట్‌ రాబోతుందని, అందుకోసమే ఈ ఫోటోని షేర్‌ చేసుకున్నారని అంటున్నారు. ఇలా అనే సందేహాలతో వైరల్‌గా మారిందీ ఈ ఫోటో. కేవలం బ్యాక్‌ సైడ్‌ నుంచి దిగిన ఫోటోకే ఈ రేంజ్‌ రియాక్షన్‌ రావడం విశేషం. మరి టీమ్‌ ఏం ఇవ్వబోతుందనేది చూడాలి. 

Bombay… Harbour… pic.twitter.com/GyJIORDVWM

— DVV Entertainment (@DVVMovies)

గ్యాంగ్‌ స్టర్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. ముంబయిలో మాఫియా బేస్డ్ గా రూపొందిస్తున్నారు. `ఓజీ` ముంబయిని ఎలా గడగడ లాడించాడు, ఎందుకు అలా చేశాడనే కథాంశంతో సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ దుమ్మురేపింది. బీజీఎం కి తోడు సుజిత్ టేకింగ్‌ పిచ్చెక్కించింది. సినిమా కూడా అదే రేంజ్‌లో ఉంటే థియేటర్లు షేక్‌ అయిపోవాల్సిందే. రికార్డులుబద్దలవ్వాల్సిందే అంటున్నారు నెటిజన్లు. ఈ సినిమాలో పవన్‌కి జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తుంది. శ్రియా రెడ్డి కీలక పాత్రలో నటిస్తుంది. ఇమ్రాన్‌ హష్మి నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారని సమాచారం. 
 

click me!