భారీ బడ్జెట్ చిత్రాలు ఏక కాలంలో విడుదల కావడం, చాలా నష్టం చేకూరుస్తుంది. అదే సమయంలో ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ బడ్జెట్ మూవీతో పోటీపడడం, పోటీ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు.
థియేటర్స్ లో రాకముందే ఆర్ ఆర్ ఆర్ సునామీ మొదలైపోయింది. 45 నిమిషాల ఫస్ట్ గ్లిమ్ప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ, ఆర్ ఆర్ ఆర్ గ్లిమ్ప్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా RRR movie జనవరి 7న విడుదల కాబోతుంది. ఈసారి విడుదల తేదీలో ఎటువంటి మార్పు ఉండబోదు.
ఈ నేపథ్యంలో సంక్రాంతి విడుదలకు సిద్దమైన రెండు బడా చిత్రాలు సమ్మర్ కి పోస్ట్ ఫోన్ అవుతున్నట్లు సమాచారం అందుతుంది. ఒకేసారి మూకుమ్మడిగా చిత్రాలు విడుదల చేయడం వలన అందరూ నష్టపోయే ప్రమాదం ఉన్న తరుణంలో, పవన్, మహేష్ తమ చిత్రాల విడుదల వెనక్కి నెట్టారని వార్తలు వస్తున్నాయి. అందరికంటే ముందుగా మహేష్ సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం ప్రభాస్ ఏకంగా తేదీతో సహా రాధే శ్యామ్ పోస్టర్ విడుదల చేశారు.
undefined
వీరిద్దరి తర్వాత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో 12న Bheemla nayak, 13న సర్కారు వారి పాట, 14న రాధే శ్యామ్ విడుదల కానున్నట్లు స్పష్టత వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే సెకండ్ లాక్ డౌన్ కి ముందు రాజమౌళి అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సెకండ్ వేవ్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ డిలే కావడం జరిగింది. కాగా అక్టోబర్ 13నుండి జనవరి 7కు ఆర్ ఆర్ ఆర్ విడుదల మారుస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.
అప్పటికే సంక్రాంతి స్లాట్ బుక్ చేసుకున్న సినిమాలకు ఈ న్యూస్ షాక్ ఇచ్చింది. రాజమౌళి తెలివిగా సంక్రాంతి కి ఒక వారం ముందు విడుదల చేయడం ద్వారా, సీజన్ ని టార్గెట్ చేశాడు. భారీ బడ్జెట్ చిత్రాలు ఏక కాలంలో విడుదల కావడం, చాలా నష్టం చేకూరుస్తుంది. అదే సమయంలో ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ బడ్జెట్ మూవీతో పోటీపడడం, పోటీ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఈ మేరకు చిత్ర నిర్మాతల మధ్య చర్చలు జరిగాయని, మహేష్ Sarkaru vaari paata, పవన్ భీమ్లా నాయక్ ఫిబ్రవరి లేదా మార్చ్ కి పోస్ట్ ఫోన్ అయినట్లు పరిశ్రమ వర్గాలలో వినిపిస్తుంది.
Also read RRR glimpse: ఎన్టీఆర్, రామ్‌చరణ్, అజయ్ దేవగన్, అలియాలతో వర్క్ చేయడంపై రాజమౌళి హాట్ కామెంట్
మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటున్న రాధే శ్యామ్ నిర్మాణ ఖర్చులు ఇప్పటికే తడిసి మోపెడు అయ్యాయి. దీనితో Radhe shyam అనుకున్న ప్రకారం విడుదల చేస్తున్నారట. ఈ పరిణామాన్ని కింగ్ నాగార్జున తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నారట. బంగార్రాజు చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించే ఆలోచన చేస్తున్నారట. నిజంగా సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ సంక్రాంతి బరి నుండి తప్పుకుంటే, ఎఫ్ 3తో పాటు బాలయ్య అఖండ ఈ స్లాట్ పై కన్నేసే అవకాశం కలదు. మరి చూడాలి ఈ సంక్రాంతి కి ఎవరెవరు ఆర్ ఆర్ ఆర్ కి పోటీగా నిలబడనున్నారో.
Also read RRR Glimpse: ఈ డిటైల్స్ గమనించారా.. ఆ ఒక్కటి మైండ్ బ్లోయింగ్
Also read