(వీడియో) కాటమరాయుడు... జన సముద్రాలయిన ధియోటర్ ప్రాంతాలు

Published : Mar 24, 2017, 05:19 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
(వీడియో) కాటమరాయుడు... జన సముద్రాలయిన ధియోటర్ ప్రాంతాలు

సారాంశం

ఎటు చూసినా జనం, కాటమరాయుడి రాకకోసం రాత్రినుంచే పడిగాపులు... రోడ్ల మీద కాటమరాయుడి పండగ

తెలుగురాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ గాలివీస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ సినిమాను తామే ముందే చూడాలనే ఉత్సుకత ఎంత ఉధృతంగా ఉంటుందో ఈ వీడియోలో చూడవచ్చు.  వేల కొలది అభిమానులు థియేటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. బెనిఫిట్ షో అవకాశవ స్తుందేమో నని ఆశించి థియేటర్స్ దగ్గరే ఎదురు చూపులు చూసేవాళ్లు ఎందరో.

 

 హైదరాబాద్ లో రాత్రి 12గంటలకు బెనిపిట్  షో  పడుతుందేమోనని అభిమానులు భావించిన వారికి నిరాశే ఎదురైంది.

 

తెల్లవారు జామున  మూడు గంటలకయినా షో వేస్తారేమోనని ఫ్యాన్స్ ఆశకూడానీరు కారింది.

 

బెనిఫిట్ షో కు పోలీస్ పర్మిషన్ లేదంటూ కాని థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో క్యాన్సిల్ చేసింది.

 

 దీంతో హైదరాబాద్ లోని నిజాంపేట్ క్రాస్ రోడ్ ఏరియా ప్రాంతంలో ఉన్న భ్రమరాంభ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ కోపోద్రిక్తులయ్యారు.  ఆ ప్రాంతం యుద్ధభూమి లా తయారయింది. ఎంతకూ శాసించని అభిమానులను శాంతింపచేసేందుకు  పోలీసులురంగ ప్రవేశం చేశారు.

 

 స్పల్పంగా లాఠీ ప్రయోగించినతర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందట.

 

అభిమానులు ఆశించినట్లు  హైదరాబాద్ లో ఎక్కడ బెనిఫిట్ షో లు వేయలేదు. తెలుగురాష్ట్రాలలో అనేక చోట్ల అభిమానులతో ఆ థియేటర్ లపరిసరాలు కిటకిటలాడాయి.

ఇక మరొక వైపు... అంతా కాటమరాయుళ్లే...

రోడ్లన్నీ కాటమరాయుడు సంబరాలతో మునిగితేలాయి. చాలా చోట్ల పవన్ వీరాభిమానులు కాటమరాయుడి స్టైల్ లోనే రోడ్ల మీద దర్శనమిస్తున్నారు.

 

పంచెకట్టు కట్టుతో గ్రీన్ కండువాని మెడకు చుట్టుకుని  థియేటర్ దగ్గర చిందులేశారు. 

 

ఏపీ, తెలంగాణలోని అన్ని థియేటర్స్ దగ్గర అభిమానులు బాణ సంచాలతో, డప్పులు మోతతో పండగ చేసుకుంటునకనారు. పవన్ కటౌట్స్ కి పాలాభిషేకాలకు లెక్కే లేదు..

 

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు