పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘ఓజీ’ నుంచి అప్డేట్ అందిన విషయం తెలిసిందే.. ఇక మరో గుడ్ న్యూస్ కూడా వచ్చింది. పవర్ స్టార్ - పూరీ కాంబోలోని మూవీ రీరిలీజ్ కాబోతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు ఈ రోజు రెండు గుడ్ న్యూస్ లు అందాయి. ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న They Call Him OG మూవీ నుంచి బిగ్ అప్డేట్ అందింది. ఈ చిత్ర రిలీజ్ డేట్ తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందింది.
డాషింగ్ హీరో పూరీ జగన్నాథ్ Puri Jagannadh - పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ (Camera Man Gangatho Rambabu). 2012లో ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్, తమన్నా భాటియా, గాబ్రియేలా బెర్టాంటే, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సౌండ్‌ట్రాక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. బద్రి (2000) తర్వాత పవన్ - పూరీ కాంబోలో వచ్చిన చిత్రమిది. ఈ మూవీ అప్పట్లో మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఈ చిత్రం ఇప్పుడు రీరిలీజ్ కు సిద్ధమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ 4కే వెర్షన్ ను సిద్ధంగా చేసింది. రేపు (ఫిబ్రవరి 7)న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయా థియేటర్ల వద్ద హంగామా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ లైనప్ లోని... ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి.
He's called rambabu assalu undadhu dhabu ...💥 Grand re-release tomorrow 🔥
Book your tickets now 🎟️ pic.twitter.com/sPncrOZwwT