పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌ సాబ్‌` సెన్సార్‌ రిపోర్ట్ ఎలా ఉందంటే?

Published : Apr 05, 2021, 07:44 PM IST
పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌ సాబ్‌` సెన్సార్‌ రిపోర్ట్ ఎలా ఉందంటే?

సారాంశం

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `వకీల్‌సాబ్‌` సినిమా ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాకి రెండు తెలుగు రాష్టాల్లో భారీగా బెనిఫిట్‌ షోస్‌ వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇది సెన్సార్‌ పూర్తి చేసుకుంది.

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` సినిమా విడుదలకు అన్ని రకాలుగా గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కూడా పూర్తి చేసుకుంది. సినిమాని వీక్షించిన సెన్సార్‌ సభ్యులు సర్టిఫై చేశారు. ఈ చిత్రానికి `యు / ఏ` సర్టిఫికేట్‌ ని ఇచ్చారు. సినిమా నిడివి 154 నిమిషాలని స్పష్టమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. సెన్సార్‌ వర్గాల నుంచి పాజిటివ్‌ రియాక్షన్‌ వచ్చిందని టాక్‌. దీంతో సినిమా రిలీజ్‌కి అన్ని రకాల క్లియరెన్స్ లు వచ్చినట్టయ్యింది. ఇక హిందీ సినిమా `పింక్‌`కి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించారు. అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల హీరోయిన్లుగా నటించారు. దిల్‌రాజు నిర్మించారు. 

ఈ సినిమా ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాకి రెండు తెలుగు రాష్టాల్లో భారీగా బెనిఫిట్‌ షోస్‌ వేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక పర్మిషన్‌ కూడా లభించిందని టాక్‌. దీంతో ఇప్పటికే ఒక్కో టికెట్‌ వేలల్లో పలుకుతుందని సమాచారం. పవన్‌ కళ్యాణ్‌ మూడేళ్ల గ్యాప్‌తో చేసిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటుందా? అనేది చూడాలి. ఇందులో పవన్‌కి జోడిగా శృతి హాసన్‌ కనిపించనున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sreenivasan: నటుడు శ్రీనివాసన్ ని ఆరాధించిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఏకంగా తన పాత్రకి డబ్బింగ్‌
కృష్ణ ను భయపెట్టిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కు చెక్ పెట్టడానికి సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్