వివాదంలో రియల్‌ హీరో సోనూ సూద్‌..పోలీసులకు మున్సిపల్‌ అధికారుల ఫిర్యాదు

Published : Jan 07, 2021, 04:54 PM IST
వివాదంలో రియల్‌ హీరో సోనూ సూద్‌..పోలీసులకు మున్సిపల్‌ అధికారుల ఫిర్యాదు

సారాంశం

రియల్‌ హీరో సోనూ సూద్‌ వివాదంలో ఇరుక్కున్నారు. ఇంటి స్థలం విషయంలో ఆయనపై పోలీస్‌ స్టేషన్‌ కేసు నమోదైంది. తన నివాస స్థలాన్ని హోటల్‌గా మార్చడం ఇప్పుడు వివాదానికి కారణమైంది.  ముంబయిలోని జుహు ప్రాంతంలో శక్తి సాగర్‌ అనే పేరుతో సోనూ సూద్‌కి ఆరంతస్థలు భవనం ఉంది.

రియల్‌ హీరో సోనూ సూద్‌ వివాదంలో ఇరుక్కున్నారు. ఇంటి స్థలం విషయంలో ఆయనపై పోలీస్‌ స్టేషన్‌ కేసు నమోదైంది. తన నివాస స్థలాన్ని హోటల్‌గా మార్చడం ఇప్పుడు వివాదానికి కారణమైంది.  ముంబయిలోని జుహు ప్రాంతంలో శక్తి సాగర్‌ అనే పేరుతో సోనూ సూద్‌కి ఆరంతస్థలు భవనం ఉంది. అధికారుల అనుమతి తీసుకోకుండా దీన్ని హోటల్‌గా మార్చారంటూ బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బిఎంసి) అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భవనానికి నోటీసులు పంపించారు. వాటిని పట్టించుకోకుండా హోటల్‌ని రన్‌ చేయడాన్ని మున్సిపల్‌ అధికారులు తప్పుపడుతూ పోలీసులకు ఫిర్యాదు చేవారు. 

నిబంధనలకు విరుద్ధంగా తాను వ్యవహరించారన్న ఆరోపణలను సోనూ సూద్‌ ఖండించారు. తన వద్ద ఆ హోటల్‌ స్థలానికి సంబంధించి అన్ని అనుమతులున్నాయని తెలిపారు. కేవలం మహారాష్ట్ర కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(ఎంసీజెడ్‌ఎంఏ) నుంచి మాత్రమే అనుమతులు రావాల్సి ఉందన్నారు. అది కరోనా వల్ల ఆలస్యమయ్యిందని పేర్కొన్నారు. ఒకవేళ దానికి పర్మిషన్‌ రాకపోతే తిరిగి నివాస స్థలంగా మారుస్తానని చెప్పారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ, ప్రాథమిక విచారణ చేపట్టాకే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని చెప్పారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌