ఆర్మీలుక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్రాండ్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓపెనింగ్

By Mahesh JujjuriFirst Published Dec 11, 2022, 1:59 PM IST
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హీరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ ఓపెనింగ్ ఈరోజు గ్రాండ్ గా జరిగింది. స్పెషల్ లుక్ లో పవన్ కల్యాణ్ మెరిసిపోయారు. 

వరుస సినిమాలు ప్రకటించిన  పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కు.. అవి కంప్లీట్ చేయడం చాలా ఇబ్బందిగా మారింది. అటు పొలిటికల్ పనులు.. ఇటు సినిమాలు  రెండు బాలన్స్ చేయడంలో.. సినిమాలు కాస్త లేట్ అవుతున్నాయి. ఈక్రమంలో ఎప్పుడు ప్రకటించిన హరీష్ శంకర్  సినిమా షూటింగ్ కి ఇప్పుడు మోక్షం వచ్చింది.  భవదీయుడు భగత్ సింగ్ గా ఉన్న ఈ మూవీ టైటిల్ ను ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. 

దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈమూవీ ఓపెనింగ్ రామానాయుడు స్టూడియోస్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆదివారం ఉదయం 11.45 గంటలకు పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు మరియు పలువురు ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆర్మీ లుక్ లో అదరిపోయేలా కనిపించాడు. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ .. సోషల్ మీడియాలో పడగ చేసుకుంటున్నారు. సినిమాలో కూడా ఇదే లుక్ ను చూపించాలని కోరుకుంటున్నారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వి.వి. వినాయక్, కె.దశరథ్, మలినేని గోపీచంద్, బుచ్చిబాబు, నిర్మాతలు ఎ.ఎం. రత్నం, దిల్ రాజు, శిరీష్, విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి, రామ్ ఆచంట, గోపి ఆచంట, కిలారు సతీష్ హాజరయ్యారు. దిల్ రాజు క్లాప్ కొట్టగా, ఎ.ఎం. రత్నం కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్ కి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. రామ్ ఆచంట, విశ్వప్రసాద్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందించారు.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటేనే అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అందులోనూ ఆయనతో గతంలో హిట్ ఇచ్చిన దర్శకుల కాంబోలో సినిమా రాబోతుందంటే ఆ క్రేజే వేరేలా ఉంటుంది. పవర్‌స్టార్ కెరీర్‌లో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే అభిమానుల అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి పవన్-హరీష్ కలయికలో ఇప్పటిదాకా వచ్చింది ఒక్క సినిమానే అయినప్పటికీ.. గబ్బర్ సింగ్ సృష్టించిన ప్రభంజనం కారణంగా 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

click me!