పవన్‌ కళ్యాణ్‌- సుజిత్‌ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Published : Jan 27, 2023, 06:52 PM IST
పవన్‌ కళ్యాణ్‌- సుజిత్‌ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

సారాంశం

`సాహో` ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేశారట. 

పవన్‌ కళ్యాణ్‌ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. `హరిహరవీరమల్లు` చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోందీ. దీంతోపాటు హరీష్‌ శంకర్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, అలాగే సుజిత్‌తో ఓ సినిమా సముద్రఖనితో ఓ రీమేక్‌ చేయబోతున్నారు. ఇప్పటికే హరీష్‌ శంకర్‌తో చేయాల్సిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఓపెనింగ్‌ జరిగింది. గ్రాండ్‌గా గతేడాది చివర్లో నిర్వహించారు. కానీ రెగ్యూలర్‌ షూటింగ్‌కి మాత్రం టైమ్‌ పడుతుంది. 

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాని ప్రారంభించబోతున్నారు పవన్‌. సుజిత్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రకటించిన విసయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మించబోతున్న చిత్రమిది. దీన్ని ఒరిజినల్‌ గ్యాంగ్‌ స్టర్‌ కథతో తెరకెక్కిస్తున్నారట. కొరియన్‌ స్టయిల్‌లో ఉంటుందనే విడుదల చేసిన పోస్టర్‌ని బట్టి తెలిసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని కూడా ప్రారంభించబోతున్నారు. అందుకు ముహూర్తం ఫిక్స్ చేశారట. జనవరి 30న సోమవారం ఈ సినిమాని గ్రాండ్‌గా ప్రారంభించేందుకు నిర్ణయించారని తెలుస్తుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

మరి ఈ సినిమాకి సంబంధించిన రెంగ్యూలర్‌ షూటింగ్‌ ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ `హరిహరవీరమల్లు` చిత్రం షూటింగ్‌ పూర్తి కాలేదు. దీనికి ఇంకా రెండు మూడు నెలలు పట్టే ఛాన్స్ ఉందట. మరి హరీష్‌ శంకర్‌ సినిమా ఎప్పుడు చేస్తాడు, త్వరలో ప్రారంభం కాబోతున్న సుజిత్‌ సినిమా షూటింగ్‌ ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. 

ఇదిలా ఉంటే ఈ సినిమాతోపాటు సముద్రఖని దర్శకత్వంలో `వినోదయసీతం` చిత్ర రీమేక్‌లో నటించాల్సి ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. అయితే మొదట ఈ సినిమానే పట్టాలెక్కుతుందని టాక్‌ వచ్చింది. కానీ పవన్‌ నిర్ణయం ఎలా ఉంటుందనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇక ఇప్పుడు నటిస్తున్న `హరిహర వీరమల్లు` చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తుండగా, నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుంది. ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Kokkoroko మూవీతో అలరించేందుకు వస్తోన్న యంగ్‌ సెన్సేషన్‌.. కొత్త పోస్టర్‌ అదిరింది
Dhoolpet Police Station Review: `ధూల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌` కేస్‌ 1 వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. చూపు తిప్పుకోలేరు