అలనాటి నటి జమున అంత్యక్రియలు అభిమానులు, కుటుంబ సభ్యుల కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. ఏపీ మంత్రి రోజా, సినీనటి జీవితా రాజశేఖర్ తదితరులు జమున భౌతికకాయానికి నివాళులర్పించారు.
అలనాటి నటి జమున అంత్యక్రియలు అభిమానులు, కుటుంబ సభ్యుల కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. తల్లి చితికి జమున కుమార్తె స్రవంతి నిప్పంటించారు. అంతకుముందు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి జమున అంతిమయాత్ర మహా ప్రస్థానానికి చేరుకుంది. అనంతరం స్రవంతి సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఏపీ మంత్రి రోజా, సినీనటి జీవితా రాజశేఖర్ తదితరులు జమున భౌతికకాయానికి నివాళులర్పించారు.
కాగా.. సీనియర్ నటి జమున ఈ రోజు(శుక్రవారం) ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతితో తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు, దక్షిణాది చిత్ర పరిశ్రమ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సాయంత్రం 4.30 గంటల వరకు ఆమె భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లోనే ఉంచి, ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానానికి తరలించారు. మరోవైపు నటి జమున మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపాలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్, కళ్యాణ్ రామ్ వంటి వారు విచారం వ్యక్తం చేశారు.
ALso REad: Jamuna: జమునపై కక్ష గట్టిన ఎన్టీఆర్, ఏఎన్నార్.. నాలుగేళ్లు బాయ్‌కాట్.. మళ్లీ ఎలా కలిశారంటే?
జమున 1936లో హంపిలో జన్మించారు.ఆమె 1953లో పుట్టిల్లు చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు. కెరీర్ ఆరంభంలోనే ఆమె ఎన్టీఆర్ ఎన్నార్ సరసన నటించే అవకాశం అందుకుంది. 1955లో ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి నటించిన ఆల్ టైం క్లాసిక్ మిస్సమ్మలో జమున కూడా నటించారు. గుండమ్మ కథ చిత్రంలో అయితే జమున నటనని ఎప్పటికీ మరచిపోలేము. గులేబకావలి కథ, మూగమనసులు ఇలాంటి చిత్రాల్లో జమున నటవిశ్వరూపం చూడొచ్చు. కుటుంబ కథా చిత్రాలు, పౌరాణికాలు, జానపదాలు ఇలా అన్ని జోనర్స్ లో తన నటనతో జమున మెప్పించారు. పొగరుబోతు అమ్మాయిగా నటించాలంటే అప్పట్లో గుర్తుకువచ్చేది జమున మాత్రమే. జమున తన కెరీర్ లో అనేక ఫిలిం ఫేర్ అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. అలాగే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. జమున భర్త జూలూరి రమణారావు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె సంతానం.