20 ఏళ్ల తర్వాత మళ్ళీ మొదలు పెట్టిన పవన్.. ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్!

Published : Dec 09, 2022, 08:40 PM IST
20 ఏళ్ల తర్వాత మళ్ళీ మొదలు పెట్టిన పవన్.. ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్!

సారాంశం

రెండు దశాబ్దాల తర్వాత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానంటూ ఓ కిల్లింగ్ ఫోజ్ షేర్ చేశారు పవన్.  పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ట్వీట్ వైరల్ గా మారింది.   

మార్షల్ ఆర్ట్స్ అంటే పవన్ కళ్యాణ్ కి అమితాసక్తి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జాని చిత్రం కోసం ఆయన కొన్నాళ్ల పాటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. జాని మూవీలో పవన్ ఫైటర్ రోల్ చేశారు. రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కమర్షియల్ గా ఆడలేదు. ఖుషి వంటి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తర్వాత వచ్చిన యాక్షన్ లవ్ ఎమోషనల్ లవ్ డ్రామా జనాలకు ఎక్కలేదు. అయితే బ్రూస్లీ ని పోలిన బాడీలో పవన్ ఫైట్స్ ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పాలి. 

పాత్రలో సహజత్వం కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. 2003 లో జాని విడుదల కాగా... దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆయనకు మార్షల్ ఆర్ట్స్ అవసరం వచ్చింది. హరి హర వీరమల్లు మూవీలో ఆయన బందిపోటు పాత్ర చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. హరి హర వీరమల్లు యాక్షన్ సీక్వెన్సెస్ కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ లో పవన్ డెంజరస్ మార్షల్ ఆర్ట్స్ ఫోజిచ్చారు. రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానంటూ కామెంట్ పెట్టారు. 

పవన్ అప్డేట్ హరి హర వీరమల్లు మూవీపై అంచనాలు మరింత పెంచేసింది. ఇక పవన్ ట్వీట్ ని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల కానుంది. ఏ ఎం రత్నం నిర్మాత కాగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

స్టార్ హీరో సినిమా ఎఫెక్ట్, నిద్రలేని రాత్రులు గడిపిన చిరంజీవి..వెళ్లి ముఖం మీదే చెబితే ఏం జరిగిందో తెలుసా ?
పొట్టకూటి కోసం పొట్ట మాడ్చుకుంటున్నా.. డైట్ సీక్రెట్ వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి