ఆరున్నర అడుగుల బుల్లెట్... నిహారిక పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ గా పవన్ కొడుకు అకీరా

Published : Dec 09, 2020, 10:31 AM IST
ఆరున్నర అడుగుల బుల్లెట్... నిహారిక పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ గా పవన్ కొడుకు అకీరా

సారాంశం

నిన్న తండ్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఉదయ్ పూర్ వెళ్లిన అకీరాను చూసిన బంధువులు ఆశ్చర్యపోతున్నారు. మెగా హీరోలలో ఏ ఒక్కరు లేనంత హైట్ అకీరా ఎదిగారు. ఇంకా టీనేజ్ పూర్తి కాకుండానే అకీరా ఆరు అడుగుల నాలుగు అంగుళాలకు చేరుకున్నట్లు తెలుస్తుంది.

నిహారిక వెడ్డింగ్ ఈవెంట్ లో మెగా హీరోల సందడి మాములుగా లేదు. వయసు అనే తారతమ్యాలు లేకుండా అందరూ వేడుకలో సందడి చేస్తున్నారు. చిరంజీవి హిట్ సాంగ్స్ కి మెగా హీరోలు స్టెప్స్ వేయడం వేడుకకు మరింత శోభను తెచ్చింది. ఉదయ్ పూర్ ప్యాలస్ మెగా కుటుంబ సభ్యులు రాయల్ గెటప్స్ లో మెరిసిపోతున్నాడు. ఈ వేడుకలో పవన్ కుమారుడు అకీరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 

 
నిన్న తండ్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఉదయ్ పూర్ వెళ్లిన అకీరాను చూసిన బంధువులు ఆశ్చర్యపోతున్నారు. మెగా హీరోలలో ఏ ఒక్కరు లేనంత హైట్ అకీరా ఎదిగారు. ఇంకా టీనేజ్ పూర్తి కాకుండానే అకీరా ఆరు అడుగుల నాలుగు అంగుళాలకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ అందరికంటే హైట్ కాగా, ఆ రికార్డు అకీరా అధిగమించాడు. అకీరాను చూస్తుంటే త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అనిపిస్తుంది. 
 
2012లో పవన్, రేణూ దేశాయ్ విడాకులు తీసుకొని విడిపోయినప్పటి నుండి అకీరా తల్లి దగ్గరే పెరుగుతున్నాడు. చాలా కాలంగా వీరు పూణేలో ఉంటున్నారు. వృతి రీత్యా రేణు దేశాయ్, హైదరాబాద్ కి మకాం మార్చడం జరిగింది. రేణూ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నా, పిల్లలు మాత్రం వాళ్ళతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే