ట్రెండ్‌ అవుతున్న పవన్‌ `వకీల్‌సాబ్‌`లోని `కంటి పాప` సాంగ్‌..

Published : Mar 17, 2021, 05:53 PM IST
ట్రెండ్‌ అవుతున్న పవన్‌ `వకీల్‌సాబ్‌`లోని `కంటి పాప` సాంగ్‌..

సారాంశం

`వకీల్‌సాబ్‌` చిత్రం నుంచి ఇప్పటికే  రెండు పాటలు విడుదలై శ్రోతలను మెప్పించగా, తాజాగా మరో పాట విడుదలైంది. `కంటి పాప.. కంటి పాప.. `అంటూ సాగే మూడో పాటని బుధవారం సాయంత్రం విడుదల చేశారు.  పవన్‌, శృతి హాసన్‌ల మధ్య వచ్చే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం `వకీల్‌సాబ్‌`. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో శృతి హాసన్‌ కథానాయికగా, నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలర పాత్రలు పోషిస్తున్నారు. బోనీ కపూర్‌ సమర్పణలో, దిల్‌రాజు నిర్మిస్తున్నారు. `పింక్‌` చిత్రానికిది రీమేక్‌. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు విడుదలై శ్రోతలను మెప్పించగా, తాజాగా మరో పాట విడుదలైంది. `కంటి పాప.. కంటి పాప.. `అంటూ సాగే మూడో పాటని బుధవారం సాయంత్రం విడుదల చేశారు.

 పవన్‌, శృతి హాసన్‌ల మధ్య వచ్చే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆలోచింప చేస్తుంది. పవన్‌, శృతిల ప్రేమ సన్నివేశాల్లో ఈ పాట వస్తుందని అర్థమవుతుంది. తమన్‌ దీనికి సంగీతం అందించగా, ఆర్మన్‌ మాలిక్‌, దీపు, తమన్‌ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి రచించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. గతంలో `మగువ.. మగువ.. `, `సత్యమేవ జయతే` పాటలు విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే