గళ్ళ లుంగీలో పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్.. ప్రీలుక్ కేక, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే

By telugu teamFirst Published Aug 13, 2021, 4:33 PM IST
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  షూటింగ్, ప్రచార కార్యక్రమాల విషయంలో వరుసగా గేర్లు మారుస్తోంది చిత్ర యూనిట్.. గత కొన్ని రోజుల నుంచి చిత్ర యూనిట్ ఈ మూవీ గురించి అప్డేట్లు ఇస్తూనే ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  షూటింగ్, ప్రచార కార్యక్రమాల విషయంలో వరుసగా గేర్లు మారుస్తోంది చిత్ర యూనిట్.. గత కొన్ని రోజుల నుంచి చిత్ర యూనిట్ ఈ మూవీ గురించి అప్డేట్లు ఇస్తూనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్ ఖరారు చేసుకోగా.. ఇక పవన్, రానా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 

ఆ తరుణం కూడా రానే వచ్చింది. ఆగష్టు 15న ఉదయం 9:45 గంటలకు పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. దీనితో పాటు ఊహించని సర్ ప్రైజ్ కూడా ఉంది. ఇప్పటి వరకు పవన్ ని పోలీస్ గెటప్ లో చూసాం. తాజాగా పవన్ కళ్యాణ్ గళ్ళ లుంగీ, బ్లూ షర్ట్ ధరించి ఉన్న ప్రీలుక్ విడుదల చేశారు. 

ఈ పోస్టర్ శాంపిల్ మాత్రమే అసలు జాతర ముందు ఉంది అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ని వెనుక నుంచి మాత్రమే చూపించారు. కారుమబ్బులు కమ్ముకుని ఉండగా పవన్ ఒకచేత్తో లుంగీ పట్టుకుని నడుచుకుంటూ వెళుతున్న స్టైల్ అద్భుతంగా ఉంది. 

దీనితో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ షురూ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో పోలీస్ అధికారి భీమ్లా నాయక్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కి జోడిగా నిత్యామీనన్ నటిస్తోంది. ఇక రానాకు జోడిగా ఐశ్వర్య రాజేష్ ని ఎంపిక చేశారు. 

మలయాళీ సూపర్ హిట్ అయ్యప్పన్ కోషియం రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా దర్శకుడు సాగర్ చంద్ర చిత్రీకరిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. 

 

Power Storm is all set to takeover with the Title & First Glimpse on 15th Aug from 09:45AM⚡

Get ready for the adrenaline rush 💉🔥 pic.twitter.com/SaqwNROqV7

— Sithara Entertainments (@SitharaEnts)
click me!