అతిలోక సుందరిని తలచుకుని ఎమోషనలైన జాన్వీ కపూర్‌.. ప్రతిరోజు మిస్‌ అవుతున్నామంటోన్న ఖుషీ కపూర్‌

Published : Aug 13, 2021, 02:32 PM IST
అతిలోక సుందరిని తలచుకుని ఎమోషనలైన జాన్వీ కపూర్‌.. ప్రతిరోజు మిస్‌ అవుతున్నామంటోన్న ఖుషీ కపూర్‌

సారాంశం

 శ్రీదేవిని తలచుకుని వాళ్లిద్దరు కూతుళ్లు ఎమోషనల్‌ అయ్యారు. పెద్ద కూతురు, హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, చిన్న కూతురు ఖుషీ కపూర్‌ అరుదైన చిత్రాలను పంచుకుని తమ బాధని వ్యక్తంచేశారు. అమ్మని ఎంతగా మిస్‌ అవుతున్నారో వెల్లడించారు. 

ఇండియన్‌ ఫస్ట్ లేడీ సూపర్‌ స్టార్‌, హీరోయిన్లకి స్టార్‌ హీరోలకు మించిన ఇమేజ్‌ని తీసుకొచ్చిన నటి శ్రీదేవి. అతిలోక సుందరిగా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయిన శ్రీదేవిని తలచుకుని వాళ్లిద్దరు కూతుళ్లు ఎమోషనల్‌ అయ్యారు. పెద్ద కూతురు, హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, చిన్న కూతురు ఖుషీ కపూర్‌ అరుదైన చిత్రాలను పంచుకుని తమ బాధని వ్యక్తంచేశారు. అమ్మని ఎంతగా మిస్‌ అవుతున్నారో వెల్లడించారు. 

జాన్వీ కపూర్‌ అమ్మ శ్రీదేవితో ఉన్న తన చిన్ననాటి ఫోటోని ఇన్‌స్టా ద్వారా షేర్‌ చేస్తూ, `హ్యాపీ బర్త్ డే ముమ్మా. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం. ప్రతి రోజు, ఎప్పటికీ మాకు నువ్వే అంతా.  ఐ లవ్యూ` అని ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది జాన్వీ కపూర్‌. ఈ పోస్ట్, ఆమె పంచుకున్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

మరోవైపు జాన్వీ చెల్లి, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ స్పందిస్తూ, బోనీ కపూర్‌తో శ్రీదేవి ఉన్న ఫోటోని పంచుకుంది. తన ఇన్‌ స్టోరీస్‌లో తాను స్పందిస్తూ `ప్రతి రోజు మిస్‌ అవుతున్నా అమ్మా` అని పేర్కొంది. ఈ పిక్‌ సైతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. 

1953,ఆగస్ట్ 13న మద్రాస్‌లో జన్మించిన శ్రీదేవి నాలుగేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్‌గా మారి, తెలుగు, తమిళం,కన్నడ, హిందీ, మలయాళంలో మూడు వందలకుపైగా చిత్రాల్లో నటించి తిరుగులేని ఇమేజ్‌తో, స్టార్‌డమ్‌తో రాణించారు. భారతీయ సినిమా పరిశ్రమలో మొట్ట మొదటి ఫీమేల్‌ సూపర్‌స్టార్‌గా నిలిచారు. అందం, అంతకు మించిన అభినయం, అద్భుతమైన నటన, అంతకు మించిన సౌందర్యం శ్రీదేవి సొంతం. 

తెలుగులో నటించిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` చిత్రంలోని `అతిలోక సుందరి` అనే ట్యాగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్న శ్రీదేవి మూడేళ్ల క్రితం దుబాయ్‌లో ఓ హోటల్‌లో ఫిబ్రవరి 24న అనుమానస్పద స్థితిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్సే టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా