Maa Elections: ప్రకాశ్ రాజ్ చుట్టూ అప్పులే.. ఫైనాన్షియల్ హిస్టరీ ఇదీ: చిట్టా విప్పిన నరేశ్

Siva Kodati |  
Published : Oct 05, 2021, 05:25 PM ISTUpdated : Oct 05, 2021, 05:29 PM IST
Maa Elections: ప్రకాశ్ రాజ్ చుట్టూ అప్పులే.. ఫైనాన్షియల్ హిస్టరీ ఇదీ: చిట్టా విప్పిన నరేశ్

సారాంశం

మా ఎన్నికల్లో (Maa elections) పోస్టల్ బ్యాలెట్ ద్వారా మంచు విష్ణు (Manchu vishnu) కుట్రకు తెరదీశారంటూ ప్రకాశ్ రాజ్ .. మా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో మంచు విష్ణు ఆయన ప్యానెల్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చారు. 

మా ఎన్నికల్లో (Maa elections) పోస్టల్ బ్యాలెట్ ద్వారా మంచు విష్ణు (Manchu vishnu) కుట్రకు తెరదీశారంటూ ప్రకాశ్ రాజ్ .. మా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో మంచు విష్ణు ఆయన ప్యానెల్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో విష్ణుకు మద్ధతుగా వున్న నరేశ్ మాట్లాడుతూ.. గతంలో మా ఎన్నికలు జరిగాయని అన్నారు. అప్పుడు తమ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని, కుటుంబాన్ని చీల్చేలా వ్యవహారం జరగలేదని ఆయన గుర్తుచేశారు. మా ఎన్నికల చరిత్రలో కేవలం జయసుధ (Jayasudha) పోటీ చేసినప్పుడే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పేపర్ వాడామని.. అంతకుముందు బ్యాలెట్ పేపర్ వుండేదని నరేశ్ చెప్పారు. ఏమి లేకుండా విషయం చేస్తున్నారని విష్ణు బాధపడుతున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బ్యాలెట్ పేపర్‌ విధానంలో ఒకవేళ గెలిస్తే నానా గందరగోళం చేస్తారేమోనని నరేశ్ ఆరోపించారు. అమెరికా లాంటి దేశాలు కూడా పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ఆయన చెప్పారు. ఏం చేయాలనేది పెద్దలకే వదిలివేద్దామని నరేశ్ వెల్లడించారు. కృష్ణ, కృష్ణంరాజులు రూ.500 ఖర్చు పెట్టలేరా.. ప్రకాశ్ రాజ్ మాట్లాడిన మాటలు బాగోలేదని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే పోస్టల్ బ్యాలెట్ నువ్వు తీసుకోవచ్చంటూ నరేశ్(Naresh) మండిపడ్డారు. ప్రకాశ్ రాజ్‌ (Prakash raj)పై ఏడున్నర కోట్ల చెక్ బౌన్స్ కేసు వుందని.. అశోక్ తివారీ, జీ ఛానెల్‌కు సైతం బకాయి పడ్డారని  నరేశ్ గుర్తుచేశారు. 

Also Read:పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుంది.. విష్ణు ప్యానెల్ పై ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు

అంతకుముందు మంగళవారం ఉదయం మంచు మనోజ్ ప్యానెల్ పై ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారికి పిర్యాదు చేశారు. మంచు మనోజ్, మోహన్ బాబు ఓట్ల కోసం అడ్డదారులు తొక్కుతున్నారని ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తమకు అనుకూలంగా మలచుకున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. శ్రీకాంత్, జీవితతో పాటు కార్యాలయానికి వచ్చిన ప్రకాష్ రాజ్ తన  ఫిర్యాదు ఎన్నికల అధికారికి సమర్పించారు. 

మోహన్ బాబు రూ. 28 వేలు ఒకేసారి కట్టారని,మహేష్ తండ్రి ఘట్టమనేని కృష్ణగారు, డిసిప్లినరీ కమిటీ మెంబర్ కృష్ణంరాజుగారు, పరుచూరి బ్రదర్స్, శారదగారు, ఇలా చాలా మంది నటుల సభ్యత ఫీజు మోహన్ బాబు చెల్లించారు. చెన్నైలో  ఉన్న శరత్ బాబు గారికి ఫోను చేసి మీ డబ్బులు మోహన్ బాబు మనుషులు చెల్లించారని అడిగితే, రూ. 500 నేను మోహన్ బాబు గారికి  గూగుల్ పే చేస్తాను అన్నారు. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా. గెలవడం కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు వద్ద మేనేజర్ గా ఉన్న వ్యక్తి ఈ చర్యలకు పాల్పడుతున్నారని ప్రకాష్ రాజ్ తెలిపారు. 
 

 


 

PREV
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌