
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా "ఓజీ" (They Call Him OG) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్, పోస్టర్స్ అన్నీ భారీ అంచనాలు పెంచాయి. అయితే, ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్నది థియేట్రికల్ ట్రైలర్.
ఎట్టకేలకు ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. చిత్ర యూనిట్ అధికారికంగా ఓజీ ట్రైలర్ డేట్ అండ్ టైం ప్రకటించారు. "ఓజీ" ట్రైలర్ సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం 10:08 గంటలకు గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు సుజీత్ ఓ అద్భుతమైన పవన్ కళ్యాణ్ పోస్టర్ విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అదే రోజున ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని టాక్ ఉన్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.సెప్టెంబర్ 25న "ఓజీ" ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
"ఓజీ"లో పవన్ కళ్యాణ్ విభిన్నమైన లుక్‌తో కనిపించబోతున్నారు. ఇమ్రాన్ హష్మీ ప్రధాన ప్రతినాయకుడిగా నటించగా, ప్రియాంక మోహన్ పవన్ కి జోడీగా కనిపించనున్నారు. అదనంగా, శ్రియా రెడ్డి, ప్రశాంత్, అర్జున్ దాస్, హరిశ్ ఉత్తమన్, అజయ్ ఘోష్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.సంగీతాన్ని థమన్ ఎస్ అందిస్తుండగా, యాక్షన్ సన్నివేశాలు, స్టైలిష్ ప్రెజెంటేషన్ సినిమాకు మరింత ప్రత్యేకతను తెచ్చేలా ఉన్నాయని ఇప్పటికే టాక్ ఉంది.ఈ ట్రైలర్‌తో "ఓజీ"పై ఉన్న అంచనాలు మరింత ఎత్తుకు చేరే అవకాశం ఉంది. పవర్ స్టార్ అభిమానులు సెప్టెంబర్ 21 ఉదయానికే ఈ విజువల్ ట్రీట్‌ను ఎంజాయ్ చేయబోతున్నారు.