OG Teaser: 'వాడు నరికిన మనుషుల రక్తాన్ని ఏ తుఫాన్ కడగలేకపోయింది'.. పవన్ OG టీజర్ మైండ్ బ్లోయింగ్ 

Published : Sep 02, 2023, 11:05 AM ISTUpdated : Sep 02, 2023, 11:12 AM IST
OG Teaser: 'వాడు నరికిన మనుషుల రక్తాన్ని ఏ తుఫాన్ కడగలేకపోయింది'.. పవన్ OG టీజర్ మైండ్ బ్లోయింగ్ 

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు తన 52వ జన్మదిన శుభాకాంక్షలు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఓజి టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు తన 52వ జన్మదిన శుభాకాంక్షలు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఓజి టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా ఏదో అద్భుతం సృష్టిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ లో పెరిగిపోయాయి. దీనికి తోడు నిర్మాణ సంస్థ  అప్డేట్స్ తో హైప్ ఆకాశాన్ని తాకింది. 

ఎట్టకేలకు ఓజి టీజర్ విడుదలయింది. టీజర్ ఆధ్యంతం అద్భుతం అనే చెప్పాలి. టీజర్ లో ముంబై మాఫియా  బ్యాక్ డ్రాప్.. పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న రక్త పాతం.. వీటన్నింటికి తోడు అర్జున్ దాస్ తన పవర్ ఫుల్ వాయిస్ తో ఇస్తున్న వాయిస్ ఓవర్ టీజర్ లో హైలైట్స్ అని చెప్పొచ్చు. పవన్ పాత్రకి అర్జున్ దాస్ ఇస్తున్న ఎలివేషన్ టెరిఫిక్ గా ఉంది. 

పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా.. అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరిని ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాన్ కడగలేకపోయింది. అది ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అంటూ అర్జున్ దాస్ పవన్ కి ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. 

 

దీనికి తోడు పవన్ రక్తపాతం సృష్టిస్తూ కత్తిని చేతబట్టి చిన్న సైజు యుద్ధమే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ స్వాగ్, స్టైల్ ఫ్యాన్స్ ని కట్టిపడేసే విధంగా ఉన్నాయి. సుజీత్ టేకింగ్ మరో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఉంది. తమన్ ఇస్తున్న బిజియం కూడా అదుర్స్ అనే చెప్పాలి. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఓజి టీజర్ ఉంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తోంది.  ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?