
పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే తన పెండింగ్ సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేశాడు. ఒక్క ఉస్తాద్ భగత్ సింగ్ తప్పించి ఓజీ, హరిహరవీరమల్లు సినిమాలలో తన పోర్షన్ షూటింగ్ తో పాటు డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశాడు. ఇక హరీష్ శంకర్ సినిమా షూటింగ్ కు సబంధించి అప్ డేట్ రావాల్సి ఉంది. ఇక ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ ఓజీ సినిమా నుంచి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. ఈమూవీ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ మూవీ షూటింగ్ పూర్తి అయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ DVV ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ ముగిసిన సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సబంధించిన పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా పవన్ కల్యాణ్‌కి కెరీర్ లో ఓ మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ముంబై నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో పవన్ కల్యాణ్ ఒక పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు.
ఇక మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో పవన్ మాస్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. DVV ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్టర్ లో పోస్టర్ తో పాటు ఇలా రాసుకొచ్చారు. “ షూటింగ్ అంతా పూర్తయ్యింది. ఇక ఇప్పుడు థియేటర్ల వంతు. ఓజీ ఆశ్చర్యపరచబోతోంది.” అని ట్వీట్ చేశారు. దాంతో ఫ్యాన్స్ దిల్ కుష్ అవుతున్నారు. అంతే కాదు ఈ ట్వీట్ తో ఓజీపై అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే.. ఇంకాస్త ఊపు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక ఓజీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అలాగే అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నండగా, DVV ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ఓజీ’ మూవీని 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ, తన సినిమా షూటింగ్‌లను సమర్థవంతంగా పూర్తి చేయడం విశేషం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు, ప్రచార వీడియోలు సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇక ఈసినిమా ద్వారా పవన్ కల్యాణ్ తన అభిమానులకు మరోసారి మాస్ ట్రీట్ ఇవ్వనున్నాడు.