పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ OG షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ ముగియగా.. తాజాగా మరో షెడ్యూల్ పై అప్డేట్ అందింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషనలో వస్తున్న చిత్రం ‘OG’. ‘సాహో’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ కొంచెం గ్యాప్ తర్వాత భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోతున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా గా రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వయలెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందంటూ ఇప్పటికే మేకర్స్ అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానుల్లో మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అనౌన్స్ మెంట్ వచ్చిన వెంటనే షూటింగ్ ను ప్రారంభించారు. ఇప్పటికే ముంబై, పూణేలలో షెడ్యూల్స్ ను పూర్తి చేశారు. సాలిడ్ యాక్షన్ సీన్స్ ను, ఓ సాంగ్ ను కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై తాజాగా అప్డేట్ అందింది.
Original Gangstar నెక్ట్స్ షెడ్యూల్ మాత్రం హైదరాబాద్ లోనే ఉండబోతోందని అంటున్నారు. మే17 నుంచి షూట్ ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ కూడా కాస్తా లెన్తీగానే ఉంటుందని అంటున్నారు. మరిన్ని కీలక సన్నివేశాలను నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పనుల్లో బిజీగా ఉంటూనే ఇటు తన ప్రాజెక్ట్స్ ను కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు. చిత్రంలో తమిళ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) నటిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న ‘హరిహర వీరమల్లు’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం దీని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. సముద్రఖని దర్వకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘వినోదయసీతమ్’ షూటింగ్ వేగంగానే ఉంది. మరోవైపు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఆలస్యం లేకుండా రూపుదిద్దుకుంటోంది. రీసెంట్ ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. #1లో ట్రెండ్ అవుతోంది.