అనుమానాలు నిజమయ్యాయి.. అలీ కుమార్తె పెళ్లికి పవన్ కళ్యాణ్ డుమ్మా..

Published : Nov 28, 2022, 12:15 PM IST
అనుమానాలు నిజమయ్యాయి.. అలీ కుమార్తె పెళ్లికి పవన్ కళ్యాణ్ డుమ్మా..

సారాంశం

రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ మధ్య కొంత గ్యాప్ పెరిగిందనే ప్రచారం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అలీ వైసీపీలో చేరడం, జనసేనకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం పవన్ కి నచ్చలేదు.

రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ మధ్య కొంత గ్యాప్ పెరిగిందనే ప్రచారం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అలీ వైసీపీలో చేరడం, జనసేనకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం పవన్ కి నచ్చలేదు. ఫలితంగా పవన్ ఆలీపై బహిరంగంగానే ఘాటుగా మాట్లాడారు. పవన్ కామెంట్స్ కి తాను కూడా హర్ట్ అయ్యానని అలీ స్పందించడం చూసాం. 

ప్రస్తుతం పవన్, అలీ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే సీఎం జగన్.. అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రోజు సాయంత్రం అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. 

ఈ వివాహ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మురళి మోహన్, బ్రహ్మానందం లాంటి సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. అలీ వైసిపి లో కొనసాగుతున్నారు కాబట్టి మంత్రి రోజా కూడా హాజరయ్యారు. అలీ, పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. ఈ రాజకీయ విభేదాల వల్ల పవన్ అలీ కుమార్తె వివాహానికి హాజరవుతారా కారా అనే అనుమానాలు ఉండేవి. ఆ అనుమానాలే నిజం అయ్యాయి. 

అలీ కుమార్తె వివాహానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. పవన్ కళ్యాణ్ విజయవాడలో జనసేన పార్టీ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. పొలిటికల్ విభేదాల కారణంగానే పవన్ కళ్యాణ్ అలీ కుమార్తె వివాహానికి హాజరు కాలేదు అని ప్రచారం జరుగుతోంది. 

అయితే త్వరలో గుంటూరులో రిసెప్షన్ వేడుక ఉండబోతోందట. ఈ రిసెప్షన్ కి సీఎం జగన్, ఇతర మంత్రులు హాజరు కానున్నట్లు టాక్. మరి రిసెప్షన్ కి అయినా పవన్ హాజరవుతాడో లేదో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?