పవన్‌ కొత్త సినిమా `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`.. మనల్ని ఎవడ్రా ఆపేదంటూ రచ్చ.. పోస్టర్‌ చూస్తే ఫ్యాన్స్ కి పూనకాలే!

Published : Dec 11, 2022, 07:32 AM ISTUpdated : Dec 11, 2022, 07:43 AM IST
పవన్‌ కొత్త సినిమా `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`.. మనల్ని ఎవడ్రా ఆపేదంటూ రచ్చ.. పోస్టర్‌ చూస్తే ఫ్యాన్స్ కి పూనకాలే!

సారాంశం

పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ల కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించారు. `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`గా దీన్ని తెరకెక్కించబోతున్నారు. లేటెస్ట్ పోస్టర్‌ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉండటం విశేషం.  

పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా అప్‌ డేట్‌ వచ్చింది. ఆదివారం పూట అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు పవన్‌. తన కొత్త సినిమాని ప్రకటించారు. హరీష్‌ శంకర్‌తో చేయాల్సిన సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` అనే టైటిల్‌ ఖరారు చేశారు. గతంలో హరీష్‌ శంకర్‌తో `భవదీయుడు భగత్‌ సింగ్‌` అనే సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ కథలో మార్పులు చేసి టైటిల్‌ కూడా మార్చినట్టు తెలుస్తుంది. తాజాగా `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` అంటూ ఈ కొత్త సినిమాని ఆదివారం ఉదయం ప్రకటించారు. `మనల్ని ఎవడ్రా ఆపేది` అనే ట్యాగ్‌ లైన్‌ దుమ్మురేపేలా ఉంది. ఫ్యాన్స్ కిది పర్‌ఫెక్ట్ ట్యాగ్‌లైన్‌లా ఉంది. అదే సమయంలో కొటేషన్‌ మాత్రం సేమ్‌ ఉంది. `ఈ సారి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, అంతకు మించి` అనే సేమ్‌ ఉండటం విశేషం. త్వరలో షూటింగ్‌ ప్రారంభించనున్నట్టు తెలిపారు.

ఈ రోజు ఉదయం లేవడంతోనే తన ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేస్తున్నాడు పవన్‌. ఈ పోస్టర్‌ చూసి అభిమానులకు పూనకాలు రావడం ఖాయమంటున్నారు నెటిజన్లు. అయితే గతంలో విడుదల చేసిన `భవదీయుడు భగత్‌ సింగ్‌` పోస్టర్‌కి ఆల్మోస్ట్ ఇది చాలా దగ్గరగా ఉండటం విశేషం. కొద్ది మార్పులను ఈ పోస్టర్‌ సూచిస్తుంది. అయితే ఇది `థెరి` రీమేక్‌గా రూపొందుతున్న ఫిల్మ్ నగర్ టాక్. చాలా రోజులుగా ఈ వార్తలు నెట్టింట, అటు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. 

`థెరి`లోని మెయిన్‌ పాయింట్‌ని తీసుకుని, దానికి `భవదీయుడు భగత్‌ సింగ్‌`లోని ఫ్లాట్‌ని కలిపి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌ అవుతుంది. ఏదేమైనా పవన్‌-హరీష్‌ కాంబినేషన్‌లో సినిమా ఇన్నాళ్లకు ఓ కొల్లిక్కి రావడంతో అటు అభిమానుల్లో, ఇటు దర్శకుడిలోనూ నూతనొత్తేజాన్నిస్తుంది. ఇక కొత్త పోస్టర్‌లో పవన్‌ని ఓ చేతితో హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ని పట్టుకుని, మరో చేతితో టీ గ్లాస్‌ పట్టుకుని ఉన్నారు. వెనకాల విద్యుత్‌ వైర్లు, కరెంట్‌ తయారు చేసే పరిశ్రమలున్నాయి. అలాగే కొంత కోల్‌ టచ్‌ కూడా ఉండటం ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించే అవకాశం ఉంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది