
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెండో కొడుక్కు నామకరణం చేశాడు. ఈ పేరులో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అసలు పేరైన శివశంకరవరప్రసాద్ లోంచి శంకర్ తీసుకుని పేరు పెట్టాడు. అయితే పూర్తి పేరు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. పవన్ సతీమణి క్రిస్టియన్ కావడంతో.. పిల్లలకు అక్కడ కూడా క్యాచీగా వుండే పేరు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో తన కూతురికి పెట్టినట్టే ఈసారి తన కొడుక్కి కూడా హిందూ, క్రిస్టియన్ రెండు మతాలకు సంబంధించి కూడా క్యాచీగా వుండేలా పేరు పెట్టారు.
పవన్, లెజినోవా దంపతులకు జన్మించిన పాపకు పోలెనా అంజనా పవనొవా అని పేరు పెట్టిన పవన్స అప్పుడు కూడా తన అమ్మ అంజనా దేవి పేరు కూతురికి వుండేలా పెట్టుకున్నాడు. ఇక తాజాగా తన కొడుక్కి పెట్టిన పేరుతో అన్నయ్యపై తనకున్న ప్రేమాభిమానాలను చాటి చెప్తున్నాడు పవన్. అన్నయ్య పేరు వుండేలా తన కొడుక్కి పేరు పెట్టడం చూస్తే చిరుపై పవన్ కున్న అభిమానం అర్థం అవుతుంది. అన్నదమ్ముల మధ్య విబేధాలున్నాయంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేలా పవన్ చర్యలు చూస్తుంటే రూమర్లు అన్నీ పటాపంచెలవుతాయని చెప్పొచ్చు.
ఇంతకీ పవన్ తన కొడుక్కి పెట్టిన పేరు ఏంటంటే మార్క్ శంకర్ పవనొవిచ్. ఈ పేరులోనే ఇటు హిందూ, అటు క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం పదాలు వుండేలా చూసుకున్న పవన్ అన్నయ్యపై అభిమానాన్ని కూడా చాటుకున్నాడు. ఇక చివర్లో వున్న పవనొవిచ్ అంటే పవన్ పేరు రష్యన్ స్టైల్లో ఇలా పిలుస్తారట.
మరోవైపు పవన్ కళ్యాణ్ కు రేణు దేశాయికి అకీరానందన్, ఆద్య ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే.