ఉస్తాద్ సెట్లోకి పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఎంట్రీ, ఇక ఫ్యాన్స్ కు పూనకాలే

Published : Jun 11, 2025, 06:13 PM IST
Pawan Kalyan joins Ustaad Bhagat Singh

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న సినిమాలను జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ పాలనకు కాస్త విరామం ఇచ్చి, తన సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు. తాజాగా ఆయన ఉస్తాద్ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 

 

టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు డిప్యూటీ సీఎం గా, ఇటు హీరోగా రెంటింటిని బ్యాలన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఈక్రమంలోనే మొన్నటి వరకూ డీసీఎం గా ఫుల్ బిజీగా ఉన్న పవన్.. తాజాగా పాలన నుంచి కాస్త విరామం తీసుకుని తన పెండింగ్ సినిమాలకు టైమ్ కేటాయించాడు. వరుసగా షూటింగ్స్ పూర్తిచేస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ ప్రాధాన్యతతో సినిమాల డేట్స్‌ను వాయిదా వేస్తూ వచ్చిన పవన్, ఇటీవల నిర్మాతలతో సమావేశమై ఆగస్టు 2025 లోపు తన చేతిలో ఉన్న అన్ని సినిమాల షూటింగ్‌లు పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కోక్కటిగా సినిమాలు కంప్లీట్ చేస్తూ వస్తున్నారు స్టార్ హీరో.

ఇక పవన్ కళ్యాణ్ మొదటిగా హరిహర వీరమల్లు సినిమాకు డేట్స్ కేటాయించి షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా రిలీజ్ కు కూడా రెడీ అవుతోంది. ఇక తరువాత పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న OG (Original Gangster) చిత్రానికి రెండు వారాల పాటు డేట్స్ ఇచ్చి షూటింగ్‌ను వేగంగా పూర్తిచేశారు. OG షూటింగ్‌ను రెండు రోజుల క్రితమే ముగించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్‌లో అడుగు పెట్టారు.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మొదట తమిళ సినిమా తేరి రీమేక్‌గా ప్రారంభమైనప్పటికీ, హిందీలో ఇప్పటికే తేరి రీమేక్ ఫ్లాప్ కావడం, రాజకీయ పరిస్థితుల మార్పుతో కలిపి కథను పూర్తిగా మార్చి ఓ ఫ్రెష్ స్క్రిప్ట్‌తో సినిమా తెరకెక్కిస్తున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో అధికారికంగా జాయిన్ అయినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్ నుండి విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పవన్‌తో పాటు హీరోయిన్ శ్రీలీల కూడా కనిపించింది. పవన్ కళ్యాణ్ స్టైలీష్ గా కనిపించారు. పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఈ వీడియో చూసి దిల్ ఖుష్ అవుతున్నారు.

పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాల షూటింగ్‌లను వేగంగా పూర్తి చేస్తున్న వేళ, ఆయన అభిమానులు ఈ అప్డేట్‌లపై ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. OG, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల తరువాత పవన్ సినిమాలకు బ్రేక్ ఇస్తాడా లేక మధ్య మధ్యలో సినిమాలు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్