త్రివిక్రమ్‌, రామ్‌చరణ్‌లపై పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా కావాల్సి వచ్చిందంటూ షాకిచ్చిన పవర్ స్టార్!

Published : Jan 27, 2023, 08:25 PM ISTUpdated : Jan 27, 2023, 08:32 PM IST
త్రివిక్రమ్‌, రామ్‌చరణ్‌లపై పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా కావాల్సి వచ్చిందంటూ షాకిచ్చిన పవర్ స్టార్!

సారాంశం

‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2’ నుంచి బాలయ్య - పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్, మెగా  పవర్ స్టార్ రామ్ చరణ్ పై పవర్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా పాపులర్ టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్ 2 మరింత ఆసక్తికరంగా సాగుతోంది. టాలీవుడ్ స్టార్స్, రాజకీయ నాయకులు ఈ షోకు హాజరై సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాల్గొన్న విషయం తెలిసిందే. బాలయ్య - పవన్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పవర్ గ్లింప్స్ విడుదలై ఆకట్టుకుంది. తాజాగా పార్ట్ 1కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. షోలో బాలయ్య అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానాలు ఆసక్తిని పెంచుతున్నాయి. 

త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవర్ స్టార్ కు ఆయా విషయాల్లోనూ సలహాలు, సూచనలు అందిస్తుంటారనేది తెలిసిందే. కాగా షోలో త్రివిక్రమ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునేందుకు పవన్ పై ప్రశ్నలు కురిపించారు. ‘ఓ సారి త్రివిక్రమ్ మీ దగ్గరికి కథ చెప్పాల్సివచ్చినప్పుడు.. మీరిద్దరూ మంచి స్నేహితులు కదా అమ్మా’ అంటూ బాలయ్య ప్రశ్నించారు. దీంతో పవర్ స్టార్ ‘మంచి ఫ్రెండ్ అవ్వాల్సి వచ్చింది’ అంటూ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఎందుకలా అన్నారది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి అడుగుతూ.. `రామ్‌చరణ్‌ ఎలా క్లోజ్‌ అంటే.. `చిన్నప్పుడు నాకు వీళ్ల డ్యూటీ ఉండేది. నాగబాబు నిర్మాతగా ఉండేవాడు కాబట్టి నేను ఒక్కడినే ఇంట్లో దొరికిపోయేవాడిని. అలా పిల్లలతో క్లోజ్‌ అవ్వాల్సి వచ్చింది` అని పవన్‌ తెలిపారు. అంతలోనే చరణ్‌కి పోన్‌ చేసి, `ఏమయ్యా ఫిట్టింగ్‌ మాస్టారూ`, అంటూ రామ్‌చరణ్‌తో ఫోన్‌లో మాట్లాడారు బాలయ్య. పవన్ నోటా ఇలాంటి సమాధానాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ప్రోమో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 3న ఆహాలో పార్ట్ 1 స్ట్రీమింగ్ కానుంది. 

PREV
Read more Articles on
click me!