తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం 17వ శతాబ్దానికి చెందిన ఒక రాబిన్ హుడ్ తరహా దొంగ కథను చెబుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూండటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం ఎన్నకలపైనే కేంద్రీకరించారు. దాదాపు షూటింగ్ లు అన్ని ఆపేసారు. పూర్తి రాజకీయాలమీదే దృ,్టి పెట్టారు. ఈ సమయంలో హరిహర వీరమల్లు సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో,చిత్ర నిర్మాత, AM రత్నం ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. హరి హర వీర మల్లు రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ధృవీకరించారు. సినిమా ఆగిపోయినట్లు,క్యాన్సిల్ చేస్తున్నట్లు వచ్చిన రూమర్స్ ని తోసిపుచ్చారు. ఈ చిత్రానికి సంబంధించి VFX పనూలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకొస్తామని మెగా సూర్య ప్రొడక్షన్స్ తెలిపింది.
అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకి మంచి సినిమా ఇచ్చే విషయంలో కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి వచ్చాక సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆ తర్వాత రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటిస్తామని తెలిపారు.అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ప్రోమోని శివరాత్రి రోజు (మార్చి 8,శుక్రవారం)నాడు వదలాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగతున్నాయని వినికిడి.ఈ ప్రోమో వస్తే ఖచ్చితంగా సినిమా ఉందని, ఎటువంటి మార్పులు ఉండవని చెప్పినట్లు అవుతుందని నిర్మాత,టీమ్ భావించారట.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం 17వ శతాబ్దానికి చెందిన ఒక రాబిన్ హుడ్ తరహా దొంగ కథను చెబుతుంది. ఈ బహుభాషా చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మొఘలులు, కుతుబ్ షాహీ రాజుల కాలం నాటి కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది. ఆ కాలపు చారిత్రక అంశాలకు సంబంధించిన వివరాలు, పరిశోధనలకు ఈ సినిమాలో ప్రాధాన్యత ఇచ్చారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తొలిసారిగా చారిత్రక చిత్రంలో కనిపించనుండటం హరి హర వీరమల్లు సినిమాకి ప్రధాన ఆకర్షణ.
మొఘల్ కాలంలో ప్రజలకు అండగా నిలబడిన ఓ బందిపోటు దొంగ పాత్రనే ఇందులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. మొఘల్ చక్రవర్తి పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నారు. ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటిస్తుంటే, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మొఘల్ రాకుమారి పాత్రలో కనిపించనుందని టాక్.