AMB క్లాసిక్ అనే పేరుతో 7 స్క్రీన్స్ ఉండే మల్టీప్లెక్స్ కట్టబోతున్నారని సమాచారం. ఈ విషయమై క్లారిటి రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..
మహేష్ బాబు మల్టిప్లెక్స్ వ్యాపారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే గచ్చిబౌలిలో వీరిద్దరూ కలిసి AMB మల్టీప్లెక్స్ కట్టగా అది సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. దీంతో ఇప్పుడు RTC X రోడ్స్ లో కూడా మల్టీప్లెక్స్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. దాని పేరు AMB Classic. ఈ మేరకు ఏర్పాట్లు అన్ని జరిగాయని వినికిడి. ఆర్టీసి క్రాస్ రోడ్ ఏరియాలో సినిమాలకు ఉన్న హడావుడితో అక్కడ కూడా AMB సక్సెస్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఎక్కడా లొకేషన్ అంటే...
RTC X రోడ్స్ ఏరియాలో 14 ఏళ్ళ క్రితం మూతపడిన ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్ ని ఇప్పుడు మహేష్ బాబు మల్టీప్లెక్స్ గా మార్చబోతున్నారు. RTC X రోడ్స్ లో సుదర్శన్ 35mm థియేటర్ దగ్గర కొత్త సినిమాల రిలీజ్ అప్పుడు జరిగే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ థియేటర్ బాగానే రన్ అవుతుంది. అయితే గతంలో సుదర్శన్ 70mm(Sudarshan) థియేటర్ కూడా ఉండేది. దాన్ని 2010లోనే మూసేసారు. ఇప్పుడు ఆ థియేటర్ స్థలాన్ని లీజుకు తీసుకొని మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ కలిసి సంయుక్తంగా AMB క్లాసిక్ అనే పేరుతో 7 స్క్రీన్స్ ఉండే మల్టీప్లెక్స్ కట్టబోతున్నారని సమాచారం. ఈ విషయమై క్లారిటి రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..
ఇదిలా ఉంటే .. సింగిల్ థియేటర్స్ అన్నీ ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్ లుగా మారిపోవటం చాలా మందిని భాధిస్తున్నాయి. మల్టీప్లెక్స్ లలో జనాలు ఎక్కువగా సినిమాలు చూడటం వల్ల సింగల్ థియేటర్ల వైపు వెళ్లడం జనాలు తగ్గించేశారు. టికెట్ రేటు ఎక్కువైన కూడా మల్టీప్లెక్స్ లలోనే సినిమాలను చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతకాలం కింద మెయింటైన్ చేయలేక మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఇప్పుడు మల్టీప్లెక్స్ లుగా మారిపోతున్నాయి..
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతుంది.. ఇండియానా జోన్స్ తరహాలో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని రాజమౌళి.. హాలీవుడ్ స్థాయిలో రూపొందించడానికి సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే హాలీవుడ్ కంపెనీస్ తో కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది మేలో స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది.