పవన్ సినిమా కోసం భారీ సెట్లు.. ప్రాచీన భారతాన్ని ఆవిష్కరించే పనిలో డైరెక్టర్ క్రిష్

Published : Mar 28, 2022, 03:36 PM IST
పవన్ సినిమా కోసం భారీ సెట్లు.. ప్రాచీన భారతాన్ని ఆవిష్కరించే పనిలో డైరెక్టర్ క్రిష్

సారాంశం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం భారీగా సెట్స్ ను ప్లాన్ చేస్తన్నారు టీమ్. ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని రీతిలో ఈ భారీ సెట్టింగ్స్ ఉంటాయట.   

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం భారీగా సెట్స్ ను ప్లాన్ చేస్తన్నారు టీమ్. ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని రీతిలో ఈ భారీ సెట్టింగ్స్ ఉంటాయట. 

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది పవర్ స్టార్ హరిహర వీరమల్లు సినిమా.17వ శతాబ్దానికి ప్రేక్షకులను తీసుకెళ్లనుందీ మూవీ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కెరియర్లోనే ఫస్ట్ టైమ్ హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు. ఆల్ రెడీ శాతకర్ణి,మణికర్ణిక లాంటి సినిమాలతో సత్తా చాటిన క్రిష్ డైరెక్షన్ లో పవర్ స్టార్ హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఎ.ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా చారిత్రక నేపథ్యంతో వస్తుండటంతో ఇండస్ట్రీతో పాటు... ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఈసినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. 

కాని అంతకంతకు ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వెళ్తోంది. హిస్టారికల్ సినిమాలు తెరకెక్కించడంలో క్రిష్ కి మంచి అనుభవం ఉంది. ఏ హీరోకి తగ్గట్టు ఆ హీరోను స్క్రీన్ మీద అద్భుతంగా చూపిస్తాడు క్రిష్. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మొగల్ చక్రవర్తుల కాలంలో నడుస్తుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో సెట్లు వేస్తున్నారు మూవీ టీమ్ దాదాపు 40 శాతం షూటింగ్  కంప్లీట్ చేసుకున్న హరిహరవీరమల్లు  కరోనా ప్రభావం వలన షూటింగును వాయిదా వేశారు. 

 

మధ్యలో ఒకటి రెండు సార్లు మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి ట్రై చేసినా కుదరలేదు. భీమ్లా నాయక్ రిలీజ్ తరువాత పవన్ హరి హర వీరమల్లు షూటింగ్ పై దృష్టి పెడతారని అంతా భావించారు. అటు  పవన్ కూడా అదే ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఈ సినిమా షూటింగ్ మళ్లీ వాయిదా పడింది. ఇక ఇప్పుడు పవర్ స్టార్  హరిహరవీరమల్లు మూవీ షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు షూటింగ్ ను స్టార్ట్ చేసి.. నాన్ స్టాప్ గా సినిమా అయిపోయే వరకూ చేసుకోవాలి అని చూస్తన్నారు. 

వీరమల్లు కోసం అప్పటి కాలాన్ని ప్రతిబింబించేలా అద్భుతమైన సెట్టింగ్స్ కు రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాదులో సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి పర్యవేక్షణలో ఈ సెట్టింగ్స్ సిద్ధం చేయిస్తున్నారు. ఈ సెట్టింగ్స్ ఒకదాన్ని మించిపోయేలా మరొకటి ఉంటాయని టాక్ వినిపిస్తోంది.  హరిహర వీరమల్లు ద్వారా ప్రాచీన భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు క్రిష్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అంతే కాదు ఈసినిమా సెట్టింగ్స్ కోసం భారీగా ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన హరిహర వీరమల్లు స్టిల్స్, గ్లింప్స్ కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా